సాయిపల్లవి 'సారంగ దరియా' పాట అరుదైన ఘనత సాధించింది. టాలీవుడ్లో అత్యంత వేగంగా 50 మిలియన్ వ్యూస్ అందుకున్న తొలి గీతంగా నిలిచింది. విడుదలైన 14 రోజుల్లోనే ఈ మార్క్‌ను చేరింది.
యూట్యూబ్‌లో 'సారంగ దరియా' పాట రికార్డు - టాలీవుడ్ న్యూస్
'లవ్‌స్టోరి' సినిమాలోని 'సారంగ దరియా' యూట్యూబ్‌లో దుమ్ముదులుపుతోంది. ఈ క్రమంలో సరికొత్త రికార్డు కూడా సృష్టించింది.
![యూట్యూబ్‌లో 'సారంగ దరియా' పాట రికార్డు saaranga dharia song clicks 50 million views](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11005459-996-11005459-1615722015401.jpg)
సారంగ దరియా సాంగ్
నాగచైతన్య హీరోగా, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన 'లవ్‌స్టోరి' సినిమాలోనిది ఈ గీతం. పవన్ సంగీతమందించగా, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఈ సినిమా ఏప్రిల్ 16న థియేటర్లలోకి రానుంది.
ఇది చదవండి:అసలు ఎవరీ 'సారంగ దరియా'!
Last Updated : Mar 14, 2021, 6:09 PM IST