తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సారాగడి సంగ్రామంలో సిక్కు'కేసరి' - కేసరి

బాలీవుడ్​ పవర్​హౌస్​ అక్షయ్​కుమార్​, పరిణితి చోప్రా కలిసి నటించిన చిత్రం 'కేసరి'. స్టిల్స్​, టీజర్​ను ఆయన ట్విట్టర్లో షేర్​ చేశారు. సిక్కులు, ఆఫ్ఘాన్​ సైనికుల మధ్య జరిగిన సారాగడి సంగ్రామం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు.

సారాగడి సంగ్రామంలో సిక్కు'కేసరి'

By

Published : Feb 13, 2019, 12:20 PM IST

బాలీవుడ్​ పవర్​హౌస్​ అక్షయ్​కుమార్​ నటిస్తోన్న చిత్రం 'కేసరి'. ఈ చిత్రానికి సంబంధించిన స్టిల్స్​ను ఆయన ట్విట్టర్లో షేర్​ చేశారు. ఈ సినిమా పార్టులుగా తెరకెక్కిస్తున్నారు. సినిమా స్టిల్స్​, చిన్నపాటి వీడియోలను అభిమానులతో పంచుకున్నాడు అక్షయ్​. ట్రైలర్​ను ఈ నెల 21 విడుదల చేయనున్నట్లు వెల్లడించాడు. మార్చి 21న సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.

  • 1897లో జరిగిన సిక్కుల 'సారాగడి' సంగ్రామాన్ని ఇందులో చూపించారు. అఫ్గాన్​ సైనికులు, సిక్కులకు మధ్య జరిగిన పోరాట దృశ్యాలు అద్భుతంగా ఉన్నాయి. 30 సెకన్ల వీడియోలో సైనికులు ఆయుధాలతో పరుగెడుతూ కనిపించారు.

చిత్రబృందం విడుదల చేసిన పోస్టర్​లో...అక్షయ్​ కత్తిపట్టకుని పోరాట యోధుడి రూపంలో రౌద్రంగా కనిపించాడు. సారాగడి యుద్ధంలో 21మంది సిక్కు సైనికులు 10వేల మంది అఫ్గాన్లను ఎలా మట్టి కరిపించారనేదే సినిమా ప్రధానాంశం. ఇందులో అక్షయ్​ హవీల్దార్​ ఇషార్​ సింగ్​ పాత్ర పోషించాడు. పరిణితి చోప్రా అక్కీతో కలిసి నటించింది. అనురాగ్​ సింగ్​ సినిమాను తెరకెక్కించారు.

  • అక్షయ్​ 'గుడ్​ న్యూస్​', 'మిషన్​ మంగళ్​' చిత్రాలతో బిజీగా ఉన్నాడు.

ABOUT THE AUTHOR

...view details