తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ముసలితనం శరీరానికి... మనసుకు కాదు' - bhumi padnekar

బాలీవుడ్ చిత్రం 'సాండ్​ కీ ఆంఖ్' తొలిరూపు విడుదలైంది. తాప్సీ, భూమి పడ్నేకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రపంచంలోనే వయోధిక షూటర్లుగా పేరు గాంచిన చాంద్రో, ప్రకాశీ తోమర్​ల జీవితాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.

తాప్సీ-భూమి

By

Published : Apr 16, 2019, 10:15 AM IST

తాప్సీ, భూమి పడ్నేకర్ ప్రధాన పాత్రధారులగా నటిస్తున్న చిత్రం సాండ్ కీ ఆంఖ్. ఈ సినిమా తొలిరూపు విడుదలైంది. దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

"శరీరానికి ముసలితనం వచ్చినా... మనసుకు రాలేదు" అనే మాటలు సినిమా​పై ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ చిత్ర ఫస్ట్​ లుక్​లో తాప్సీ, భూమి 60 ఏళ్ల పైబడిన మహిళల పాత్రల్లో కనిపిస్తూ.. ఆశ్చర్యపరుస్తున్నారు.

తాప్సీ- భూమి

ప్రపంచంలోనే వయోధిక షూటర్లుగా పేరుగాంచిన చాంద్రోతోమర్, ప్రకాశీ తోమర్ జీవితాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. వీరిద్దరూ షూటింగ్​లో 700పైగా జాతీయ పతకాలు గెల్చుకున్నారు. చాంద్రోగా తాప్సీ నటిస్తుండగా, ప్రకాశీ పాత్రను భూమి పోషిస్తోంది.

ఈ సినిమాకు తుషార్ హిరాందాని దర్శకుడు. అనురాగ్ కశ్యప్, నిధి పామర్ నిర్మాతలు.

ABOUT THE AUTHOR

...view details