Saana kastam song: హీరో చిరంజీవి కోసమే తాను 'ఆచార్య'లోని ప్రత్యేక గీతంలో నర్తించానని రెజీనా చెప్పింది. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న రెజీనా.. ఈ పాట గురించి కొన్ని విశేషాలను తెలిపింది. సినిమా చిత్రీకరణ ఈ పాటతోనే మొదలైందని, నాలుగు రాత్రుల్లో పాటను పూర్తిచేశామని చెప్పింది.
తానెప్పుడూ ఇలాంటి పార్టీ సాంగ్స్/ ప్రత్యేక గీతాల్లో నటించలేదని, చిరంజీవి కోసమే తొలిసారి నర్తించానని రెజీనా చెప్పుకొచ్చింది. చిరును మెగాస్టార్ అని ఎందుకు పిలుస్తారో సెట్స్‌లో చూస్తే అర్థమైందని తెలిపింది. చిరంజీవి డ్యాన్స్ తనకెంతో ఇష్టమని, ఆయన యువతరం నటులను ప్రోత్సహిస్తుంటారని ఆనందం వ్యక్తం చేసింది. 'సానా కష్టం వచ్చిందే మందాకిని' అంటూ సాగే ఈ పాట ఇటీవల విడుదలై శ్రోతల్ని విశేషంగా అలరిస్తోంది.