యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటించిన సినిమా 'సాహో'. భారీ అంచనాలతో వస్తున్న ఈ చిత్రం ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. కోర్టు ఉత్తర్వుల ద్వారా తెలుగు రాష్ట్రాల్లో 'సాహో' టికెట్ ధరలను థియేటర్ యజమాన్యాలు పెంచాయి.
తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన 'సాహో' టికెట్ ధరలు - SAAHO TICKET RATE HIKE in telugu states
కోర్టు ఉత్తర్వుల ద్వారా 'సాహో' సినిమా టికెట్ ధరలను పెంచుతున్నట్లు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ యాజమాన్యాలు ప్రకటించాయి.
![తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన 'సాహో' టికెట్ ధరలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4266059-643-4266059-1566997126416.jpg)
సాహో ప్రభాస్
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ఓ థియేటర్లో పన్నుతో కలిపి రూ.112 ఉన్న టికెట్ రూ.150కు పెరిగింది. రూ.80 టికెట్ రూ.100కు, రూ.40 టికెట్ రూ.50కు పెరిగింది. ఈ ధరలు కేవలం సినిమా వచ్చిన మొదటి వారం వరకే ఉండేందుకు అనుమతి ఉంది. జంట నగరాల్లోని 127 సినిమా హాళ్లలో ఈ పెరిగిన రేట్లు అమల్లోకి రానున్నాయి. ఆన్‌లైన్‌లోనూ ఈ ధరలతోనే టికెట్ విక్రయాలు జరుగుతున్నాయి.
ఇది చదవండి: 'సాహో'కు అందుకే అంత ఖర్చు: ప్రభాస్
Last Updated : Sep 28, 2019, 3:25 PM IST