తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ట్రెండింగ్​లోనే కాదు.. వీక్షణలోనూ సాహోకు అగ్రస్థానమే

ప్రభాస్ సాహో టీజర్​ విడుదలైన కొద్దిసేపటికే ట్రెండింగ్​లో నిలిచింది. కేవలం 6 గంటల్లో 25 మిలియన్ల వీక్షణలు (అన్ని భాషల్లో కలిపి) సొంతం చేసుకుంది.

By

Published : Jun 13, 2019, 9:02 PM IST

ట్రెండింగ్​లోను.. వీక్షణలోనూ సాహోకు అగ్రస్థానమే

బాహుబలి తర్వాత తన సినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు 'సాహో' టీజర్​తో అదిరే బహుమతి ఇచ్చాడు హీరో ప్రభాస్. గురువారం విడుదలైన ఈ టీజర్​ అన్ని భాషల్లో కలిపికేవలంఆరు గంటల్లోనే 25 మిలియన్ల వ్యూస్​ను సొంతం చేసుకుంది. హాలీవుడ్​ రేంజ్​లో ఉన్న సన్నివేశాలకు మంత్రముగ్ధులైపోతున్నారు డార్లింగ్​ ఫ్యాన్స్.

తెలుగులో ఇప్పటికే 5.1 మిలియన్‌ వీక్షణలు దాటగా, తమిళంలో 3.5 మిలియన్లు, మలయాళం 4.25 లక్షలు, ఇక హిందీలో 6.2 మిలియన్ల డిజిటల్‌ వ్యూస్‌ దాటి సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతుంది.

సాహో సినిమా పోస్టర్

సాధారణ ప్రజలతో పాటు ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా టీజర్​పై ప్రశంసలు కురిపిస్తున్నారు. శ్రద్ధా కపూర్ హీరోయిన్. సుజీత్ దర్శకత్వం వహించాడు. యూవీ క్రియేషన్స్ చిత్రాన్ని నిర్మించింది. ఒక పాట మినహా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘సాహో’ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది చదవండి: టీజర్​కు 'సాహో' అంటున్న సెలెబ్రిటీలు

ABOUT THE AUTHOR

...view details