ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన భారీ యాక్షన్ చిత్రం 'సాహో'. ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా కలెక్షన్లు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల అంత ఆశాజనకంగా లేవు. అయితే నెల్లూరులో మాత్రం రికార్డు వసూళ్లు సాధిస్తోంది. జిల్లాలో 16వ రోజు 1,85,796 రూపాయల షేర్ సాధించింది. మొత్తం ఇప్పటివరకు 4,30,50,033 రూపాయల వసూళ్లను రాబట్టింది. ఫలితంగా బాహుబలి-1 పేరిట ఉన్న 4.30 కోట్ల కలెక్షన్ల రికార్డుని అధిగమించింది. అయితే బాహుబలి-2 అగ్రస్థానంలో కొనసాగుతోంది.
అక్కడ 'బాహుబలి'ని బీట్ చేసిన 'సాహో' - bahubali
ప్రభాస్ 'సాహో' నెల్లూరులో రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతుంది. జిల్లాలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా నిలిచింది.
సాహో
'బాహుబలి 2', 'సాహో', 'బాహుబలి', 'రంగస్థలం', 'ఖైదీ 150' నెల్లూరులో అత్యధిక కలెక్షన్లు సాధించిన తొలి ఐదు చిత్రాలుగా నిలిచాయి. కానీ 'సాహో' మొదటిరోజు ఓపెనింగ్ కలెక్షన్స్ పరంగా 'బాహుబలి 2' చిత్రాన్ని దాటేసి మొదటి స్థానంలో ఉంది.
ఇవీ చూడండి.. సైకత శిల్పంగా మాస్ మహారాజ 'డిస్కోరాజా'
Last Updated : Sep 30, 2019, 5:39 PM IST