తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఈ ఏడాది ట్రెండింగ్ సినిమాల్లో 'సాహో' ​టాప్ - saaho

ఈ ఏడాది అత్యధికంగా ట్రెండ్ అయిన సినిమాల లిస్ట్​ను ప్రముఖ మూవీ బుకింగ్ సంస్థ బుక్​ మై షో విడుదల చేసింది. ఈ జాబితాలో ప్రభాస్ 'సాహో' రెండో స్థానంలో నిలిచింది. మరి మొదటి స్థానంలో ఉన్న సినిమా ఏంటో తెలుసుకోవాలా. అయితే పూర్తిగా చదివేయండి.

Saaho
సాహో

By

Published : Dec 25, 2019, 11:01 AM IST

2019 సినీ క్యాలెండర్ దాదాపు ముగిసిపోయింది. చిన్న చిత్రాలు, భారీ బడ్జెట్ సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. ఇందులో ఈ ఏడాది దేశవ్యాప్తంగా అత్యధికంగా ట్రెండ్ అయిన చిత్రాల లిస్ట్​ను ప్రముఖ మూవీ బుకింగ్ వెబ్​సైట్ బుక్ మై షో విడుదల చేసింది. ఈ ఏడాది ఎక్కువగా ట్రెండ్ అయిన జాబితాలో ప్రభాస్ 'సాహో' రెండవ స్థానంలో నిలిచింది. మరి మొదటి ప్లేస్​ ఎవరిదని అనుకుంటున్నారా..! మార్వెల్ వారి సూపర్ హీరోస్ మూవీ 'అవెంజర్స్ ది ఎండ్ గేమ్' అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. మెగాస్టార్ 'సైరా' మూవీ ఆరోస్థానాన్ని దక్కించుకుంది.

ఈ ఏడాది ట్రెండయిన టాప్​-10 సినిమాల లిస్టిదే

1. అవెంజర్స్: ఎండ్​గేమ్
2. సాహో
3.బిగిల్
4.వార్
5.కెప్టెన్ మార్వెల్
6.సైరా నరసింహా రెడ్డి
7.స్పైడర్​ మ్యాన్: ఫ్యార్ ఫ్రమ్ హోమ్
8.విశ్వాసం
9.దబంగ్ 3
10.పేట

ఇవీ చూడండి.. 'మహాభారతం'లో బాలీవుడ్ బిగ్ స్టార్స్

ABOUT THE AUTHOR

...view details