తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సాహో ప్రపంచ రికార్డ్​... కలెక్షన్స్​లో నంబర్ 2 - ప్రపంచంలోనే 'సాహో'కు రెండో స్థానం

ప్రపంచవ్యాప్తంగా వారాంతంలో అత్యధిక వసూళ్లు సాధిం​​​​​​​చిన సినిమాల జాబితాలో రెండో స్థానంలో నిలిచింది 'సాహో'. బాలీవుడ్​లోనూ సెంచరీకి చేరువలో ఉందీ చిత్రం.

సాహో ప్రభాస్

By

Published : Sep 3, 2019, 1:20 PM IST

Updated : Sep 29, 2019, 6:56 AM IST

యంగ్​ రెబల్​ స్టార్ ప్రభాస్​ హీరోగా నటించిన 'సాహో'.. ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల సునామీతో రికార్డులు సృష్టిస్తోంది. విడుదలైన మూడు రోజుల్లో రూ.294 కోట్ల గ్రాస్​ వసూలు చేసిన ఈ చిత్రం.. మరో అరుదైన ఘనత సాధించింది. ప్రపంచవ్యాప్తంగా వారాంతంలో అత్యధిక మొత్తం సాధించిన రెండో సినిమాగా నిలిచింది. ఈ జాబితా టాప్​లో హాలీవుడ్​ చిత్రం 'హాబ్స్ అండ్ షా' ఉంది. తర్వాతి స్థానాల్లో 'ద లయన్ కింగ్', 'వన్స్ అపాన్​ ఏ టైమ్​ ఇన్ హాలీవుడ్', 'ఏంజల్ హ్యాస్ ఫాలెన్' ఉన్నాయి.

బాలీవుడ్​లో రూ.100 కోట్లకు చేరువలో ఉంది 'సాహో'. ఈ విషయాన్ని ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్విట్టర్​లో పంచుకున్నాడు. ప్రస్తుతం రూ.93.28 కోట్ల వసూళ్లతో సెంచరీ వైపు పరుగులు పెడుతోందీ చిత్రం.

ఈ సినిమాలో హీరోయిన్​గా శ్రద్ధా కపూర్ నటించింది. జాకీష్రాఫ్, అరుణ్ విజయ్, చుంకీ పాండే, మందిరా బేడీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సుజీత్ దర్శకత్వం వహించాడు. యూవీ క్రియేషన్స్ నిర్మించింది.

ఇది చదవండి: మూడొందల కోట్లకు చేరువలో 'సాహో' వసూళ్లు

Last Updated : Sep 29, 2019, 6:56 AM IST

ABOUT THE AUTHOR

...view details