తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సాహో గురించి కొన్ని ఆసక్తికర విషయాలు - prabhas

భారీ అంచనాలతో నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది సాహో. విడుదలకు ముందే కొన్ని రికార్డులు సొంతం చేసుకుందీ చిత్రం. ప్రభాస్, శ్రద్ధాకపూర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం!

సాహో

By

Published : Aug 30, 2019, 6:01 AM IST

Updated : Sep 28, 2019, 7:59 PM IST

సాహో.. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే మేనియా.. నేడు విడుదలవుతున్న ఈ సినిమా కోసం సగటు ప్రేక్షకుడు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాడు. టిక్కెట్ల కోసం వేట మొదలు పెట్టారు.. తెలిసిన వాళ్లందరిని అడిగి ఎలాగోలా తొలిరోజే సినిమా చూడాలని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరి ఇన్ని అంచనాలతో విడుదల కానున్న సాహో చిత్రం గురించి చాలా ఆసక్తికర విషయాలు ఉన్నాయి.

దాదాపు రూ. 300 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్​..

రూ.300 కోట్లకుపైగా బడ్జెట్​తో తెరకెక్కిన సాహోకు విడుదలకు ముందే పెట్టుబడిని రాబట్టుకుంది. థియరిటికల్, శాటిలైట్, డిజిటల్ స్ట్రీమింగ్, మ్యూజికల్ హక్కులు తదితర రూపాల్లో ఇప్పటికే రూ. 290 కోట్లను రాబట్టుకుంది. సినిమా మంచి టాక్ తెచ్చుకుని విజయం సాధిస్తే రూ. 500 కోట్ల మార్కును అవలీలగా దాటే అవకాశం కనిపిస్తోంది. రోబో 2.0, బాహుబలి2 సినిమాల అనంతరం అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రంగా అవతరించింది.

ప్రభాస్ - శ్రద్ధా

తెలుగు రాష్ట్రాల్లో టిక్కెట్​ ధరలు పెంపు..

తెలుగు రాష్ట్రాల్లో సాహో సినిమా కోసం టిక్కెట్ల దరలు పెరిగాయి. కోర్టు ఉత్తర్వుల ద్వారా ఏపీ, తెలంగాణల్లో 'సాహో' టికెట్​ ధరలను థియేటర్ యజమాన్యాలు పెంచాయి. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్​రోడ్స్​లోని ఓ థియేటర్​లో పన్నుతో కలిపి రూ.112 ఉన్న టికెట్ రూ.150కు పెరిగింది. రూ.80 టికెట్ రూ.100కు, రూ.40 టికెట్ రూ.50కు పెరిగింది. ఈ ధరలు కేవలం సినిమా వచ్చిన మొదటి వారానికే పరిమితం అవుతాయి. తర్వాత సాధారణ ధరల్లో లభిస్తాయి.

సొంత ఎమోజీ కలిగిన ఏకైక తెలుగు చిత్రం..

ట్విట్టర్లో సొంత ఎమోజీ కలిగిన ఒకే ఒక్క తెలుగు చిత్రంగా సాహో రికార్డు సృష్టించింది. రజినీకాంత్ కబాలి, షారుఖ్ జీరో తర్వాత ఈ ఘనత సాధించిన హీరో ప్రభాసే. అంతర్జాలంలో ఆగస్టు 31 వరకు అందుబాటులో ఉంటుంది.

సొంత ఎమోజీ కలిగిన చిత్రం

బరువు తగ్గిన ప్రభాస్​..

బాహుబలి సినిమా కోసం బరువు పెరిగిన ప్రభాస్​ సాహో చిత్రం కోసం 10 కేజీల బరువు తగ్గాడు. పోలీసు పాత్రకు తగినట్లుగా శరీరాకృతిని మార్చుకున్నాడు డార్లింగ్​. ఇందుకోసం స్విమ్మింగ్, సైక్లింగ్​తో పాటు జిమ్​లో చెమటోడ్చాడు.

సాహోలో ప్రభాస్​

అత్యధిక బుకింగ్స్​ నమోదైన చిత్రంగా రికార్డు..

భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రానున్న సాహో టిక్కెట్లు హాట్​ కేకుల్లా అమ్ముడుపోయాయి. రెండు తెలుగురాష్ట్రాల్లో బుకింగ్​ యాప్స్​లో ఎక్కువ సేపు ఈ సినిమా కోసం ఎదురు చూశారు మూవీ లవర్స్​. అత్యధిక బుకింగ్స్​ నమోదైన తెలుగు చిత్రంగా రికార్డు సృష్టించింది సాహో.

హాలీవుడ్ స్టంట్ మాస్టర్​తో పోరాటాల చిత్రీకరణ..

ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది సినిమాలో పోరాటాలు ఏ స్థాయిలో ఉన్నాయో! హాలీవుడ్ చిత్రాలకు దీటుగా పోటీపడుతున్న సాహో చిత్రంలో ఫైట్స్​ను అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కెన్నీ బేట్స్​ రూపొందించారు. ఈ సినిమాలో తన కెరీర్​లోనే అత్యుత్తమ యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కించానని బేట్స్​ చెప్పడం విశేషం.

24 గంటల్లోనే అత్యధిక వీక్షణలు పొందిన సాంగ్..

సాహోలోని బ్యాడ్​బాయ్ సాంగ్ విడుదలైన 24 గంటల్లోనే అత్యధిక వీక్షణలు అందుకుంది. ప్రపంచంలోనే ఎక్కువ మంది చూసిన పాటగా రికార్డు సృష్టించింది. ఆస్ట్రియాలో చిత్రీకరించిన ఈ సాంగ్​లో ప్రభాస్​తో బాలీవుడ్ నటి జాక్వలిన్ ఫెర్నాండేజ్ జతకట్టింది. అమ్మాయిల బికినీలతో డార్లింగ్ స్టైలిష్​ స్టెప్పులతో, జాక్వలిన్ మత్తెక్కించే సొగసులతో కుర్రకారును ఉర్రూతలూగించిందీ పాట.

రికార్డు వీక్షణలు

యూవీ క్రియేషన్స్​ బ్యానర్​పై వంశీ - ప్రమోద్ నిర్మించారు. శ్రద్ధాకపూర్ హీరోయిన్​గా నటించిన ఈ సినిమాలో జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేశ్, మురళీశర్మ, అరుణ్​విజయ్​ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. సుజీత్ దర్శకత్వం వహించారు.

ఇది చదవండి: అతిపెద్ద థియేటర్​ను ప్రారంభించిన 'అల్లూరి'

Last Updated : Sep 28, 2019, 7:59 PM IST

ABOUT THE AUTHOR

...view details