తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సాహో' వసూళ్ల సునామీ.. తొలిరోజే సెంచరీకి మించి - శ్రద్ధా కపూర్

డార్లింగ్​ ప్రభాస్​ హీరోగా నటించిన 'సాహో'.. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు రూ.130 కోట్ల మేర గ్రాస్ సాధించిందని నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్​ ప్రకటించింది.

'సాహో' వసూళ్లు.. తొలిరోజే సెంచరీకి మించి

By

Published : Aug 31, 2019, 4:46 PM IST

Updated : Sep 28, 2019, 11:34 PM IST

ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన భారీ బడ్జెట్​ చిత్రం 'సాహో'. యంగ్​ రెబల్​ స్టార్ ప్రభాస్​, బాలీవుడ్​ భామ శ్రద్ధా కపూర్​ హీరోహీరోయిన్లు​గా నటించారు. భారీ స్థాయిలో విడుదలైన ఈ సినిమా అదే రేంజ్​లో ప్రభంజనం సృష్టించింది. తొలిరోజే రూ.130 కోట్ల మేర గ్రాస్​ సాధించినట్లు నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్​ సామాజిక మాధ్యమాల్లో పేర్కొంది.

నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ఫేస్​బుక్ పోస్ట్

రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దక్కిన వసూళ్లు రూ.42 కోట్లు, బాలీవుడ్‌ వాటా రూ.24.40 కోట్లుగా ఉంది. అమెరికాలోనూ బాక్సాఫీస్‌ ముందు జోరు చూపించింది 'సాహో'. ఈ క్రమంలోనే వసూళ్ల పరంగా హిందీ చిత్రసీమలో కొత్త రికార్డు నెలకొల్పింది. తొలిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. తొలి రెండు స్థానాల్లో సల్మాన్​ఖాన్ 'భారత్'(రూ.42.30 కోట్లు), అక్షయ్ కుమార్ 'మిషన్ మంగళ్'(రూ.29.16 కోట్లు) ఉన్నాయి. 'సాహో'కు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తున్న నేపథ్యంలో వీకెండ్‌ వసూళ్లపై ఈ టాక్‌ ప్రభావం ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.

ఇవీ చూడండి:

Last Updated : Sep 28, 2019, 11:34 PM IST

ABOUT THE AUTHOR

...view details