టాలీవుడ్ యువ దర్శకుడు సుజీత్.. ఓ ఇంటివాడయ్యారు. ప్రేయసి ప్రవల్లికను పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. కరోనా ప్రభావం ఉండటం వల్ల ఇరుకుటుంబాలకు చెందినవారు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
'సాహో' దర్శకుడు సుజీత్.. ఓ ఇంటివాడయ్యాడు - సుజీత్ లూసిఫర్ రీమేక్
డైరెక్టర్ సుజీత్ వివాహం కరోనా వల్ల చాలా నిరాడంబరంగా జరిగింది. ప్రస్తుతం ఇతడు 'లూసిఫర్' రీమేక్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నారు.
!['సాహో' దర్శకుడు సుజీత్.. ఓ ఇంటివాడయ్యాడు saaho director sujeeth marriage done](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8269794-449-8269794-1596373173444.jpg)
దర్శకుడు సుజీత్
ఈ లాక్‌డౌన్‌లోనే యువ హీరోలు నిఖిల్, నితిన్, నిర్మాత దిల్‌రాజు, హాస్యనటుడు మహేశ్‌ల వివాహాలు జరిగాయి. వీరిబాటలో సుజీత్ కూడా నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నారు.
'రన్ రాజా రన్'తో దర్శకుడిగా పరిచయమైన సుజీత్.. రెండో సినిమా 'సాహో'తో ఏకంగా డార్లింగ్ ప్రభాస్‌ను డైరెక్ట్ చేశారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో 'లూసిఫర్' రీమేక్ చేయనున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి.
Last Updated : Aug 2, 2020, 7:20 PM IST