తెలుగు యువదర్శకుడు సుజీత్ ఇప్పుడు ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఆయనకు తను ప్రేమించిన ప్రియురాలు ప్రవల్లికతో పెళ్లికానుంది. తాజాగా వీరిద్దరి నిశ్చితార్థం బుధవారం గోల్కొండ రిసార్ట్స్ లో జరిగింది. ప్రవల్లిక దంత వైద్యురాలిగా పనిచేస్తోంది.
ప్రియురాలితో 'సాహో' దర్శకుడి నిశ్చితార్థం - సుజీత్ నిశ్చితార్థం
'సాహో' దర్శకుడు సుజీత్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తాజాగా ఈ డైరెక్టర్‌కు తన ప్రియురాలు ప్రవల్లికతో నిశ్చితార్థం జరిగింది.
![ప్రియురాలితో 'సాహో' దర్శకుడి నిశ్చితార్థం సుజీత్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7572822-thumbnail-3x2-suj.jpg)
సుజీత్
'రన్ రాజా రన్' చిత్రంతో దర్శకుడిగా సినీరంగ ప్రవేశం చేసిన సుజీత్ 'సాహో'తో దేశవ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్నాడు. ఇందులో కథానాయకుడిగా ప్రభాస్, హీరోయిన్‌గా శ్రద్దా కపూర్ నటించి అలరించారు. ఈ చిత్రం అటు హిందీతో పాటు దక్షిణాదిలోనూ విడుదలై ఆకట్టుకుంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా మలయాళంలో వచ్చిన 'లూసిఫర్' రీమేక్‌కు దర్శకత్వం వహించనున్నాడు.
Last Updated : Jun 11, 2020, 9:46 PM IST