యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'సాహో' బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. కోట్లకు కోట్లు వసూళ్లు సాధిస్తూ రికార్డులు నమోదు చేస్తోంది. విడుదలైన మూడు రోజుల్లో రూ.294 కోట్ల గ్రాస్ సాధించిందని చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్.. సామాజిక మాధ్యమాల్లో వెల్లడించింది.
దక్షిణాది సినిమా అయినప్పటికీ ఉత్తరాదిలోనూ 'సాహో' సునామీ సాగుతోంది. అక్కడ మూడు రోజుల్లో రూ.79.08 కోట్ల షేర్ దక్కించుకున్నట్లు ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్విట్టర్లో వెల్లడించాడు. ఇలా అన్నిచోట్ల వసూళ్ల పరంపర కొనసాగిస్తున్న 'సాహో'.. ఈ వారంలో ఇంకెన్ని రికార్డులు తిరగరాస్తుందో చూడాలి.