అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన చిత్రం 'సాహో'. ప్రభాస్ హీరోగా నటించాడు. ఇందులోని బ్యాడ్‌బాయ్ అంటూ సాగే ప్రత్యేక గీతం సోమవారం విడుదలైంది. బాలీవుడ్ ప్రముఖ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇందులో నర్తించింది. ప్రపంచవ్యాప్తంగా ఈనెల 30న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
సాహో: బ్యాడ్‌బాయ్.. పక్కనే అందమైన అమ్మాయి - ప్రభాస్
'సాహో'లో బ్యాడ్‌బాయ్ అంటూ సాగే గీతం ప్రేక్షకుల్ని అలరిస్తోంది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇందులో నర్తించింది. ఆగస్టు 30న సినిమా విడుదల కానుంది.
![సాహో: బ్యాడ్‌బాయ్.. పక్కనే అందమైన అమ్మాయి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4178312-895-4178312-1566211437506.jpg)
'సాహో'లో బ్యాడ్‌బాయ్ అంటూ సాగే గీతం
భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటించింది. నీల్ నీతేశ్ ముఖ్, అరుణ్ విజయ్, చుంకీ పాండే, మహేశ్ మంజ్రేకర్, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. వివిధ సంగీత దర్శకులు పాటలు రూపొందించారు. జిబ్రాన్ నేపథ్య సంగీతమందించాడు. సుజీత్ దర్శకుడు. యూవీ క్రియేషన్స్ సుమారు రూ.350 కోట్లతో నిర్మించింది.
ఇది చూడండి: సాహా ప్రీరిలీజ్ ఈవెంట్ చిత్రమాలిక
Last Updated : Sep 27, 2019, 1:17 PM IST