ప్రేమకథల్లో చక్కగా ఒదిగిపోయే శర్వానంద్‌కు మాస్ సినిమాలు అంతగా అచ్చిరాలేదు. ఈ ఏడాది 'రణరంగం'తో ఈ తరహా ప్రయత్నమే చేసి, చేదు అనుభవాన్ని పొందాడు. ఇప్పుడు అజయ్ భూపతి దర్శకత్వంలో మరోసారి యాక్షన్ సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. 'ఆర్ఎక్స్100'తో దర్శకుడిగా అందరి దృష్టినీ ఆకర్షించిన అజయ్‌పై భారీ అంచనాలు పెట్టుకున్నాడీ కథానాయకుడు.
శర్వానంద్ 'మహా సముద్రం'లోకి దిగుతాడా! - శర్వానంద్ మహా సముద్రం
విభిన్న కథలతో అలరిస్తున్న శర్వానంద్.. మాస్ సినిమాల్లో అంతగా రాణించలేకపోతున్నాడు. అయినా సరే ఇప్పుడు అలాంటి చిత్రంలోనే నటించాలని నిర్ణయించుకున్నాడట. అజయ్ భూపతి దర్శకత్వంలో 'మహా సముద్రం' అనే యాక్షన్ సినిమా చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
![శర్వానంద్ 'మహా సముద్రం'లోకి దిగుతాడా! RX 100 Director ajay Teams Up With Sharwanand For Mahasamudram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5519038-495-5519038-1577519183075.jpg)
వారెవరూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు
'మహా సముద్రం' కథను అజయ్ ఇప్పటికే రవితేజ, నాగచైతన్య, కార్తికేయలకు వినిపించాడు. కానీ, వారెవరూ అందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఫలితంగా ఈ కథ శర్వానంద్ వద్దకు చేరిందట.
మరో హీరో ఎవరు..?
ఈ చిత్రంలో శర్వాతో పాటు మరో హీరోకి ఛాన్స్ ఉంటుంది. శర్వానంద్ ఓకే అంటే మరో కథానాయకుడి పాత్రను ఎవరు చేస్తారన్నది ఆసక్తికర అంశం. మరి ఈ హీరో చేయనున్న సాహసం ఫలిస్తుందా? లేదా? అన్నది తెలియాలంటే ఈ ప్రాజెక్టుపై స్పష్టత రావాల్సిందే. ప్రస్తుతం శర్వానంద్ '96' రీమేక్‌తో పాటు 'శ్రీకారం' అనే మరో సినిమా చేస్తున్నాడు.