తెలంగాణ

telangana

ETV Bharat / sitara

టాలీవుడ్​లో మరో దర్శకుడికి సోకిన కరోనా - DIRECTOR AJAY BHUPATHI CORONA

కరోనా బారిన పడ్డ దర్శకుడు అజయ్ భూపతి.. త్వరలో తిరిగొచ్చి, ప్లాస్మా దానం చేస్తానని వెల్లడించారు.

టాలీవుడ్​లో మరో దర్శకుడికి సోకిన కరోనా
దర్శకుడు అజయ్ భూపతి

By

Published : Aug 13, 2020, 9:24 AM IST

తొలి సినిమా 'ఆర్ఎక్స్ 100'తోనే గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అజయ్ భూపతి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించారు. 'వచ్చేసింది.. త్వరలో వస్తా, ప్లాస్మా ఇస్తా' అని ట్వీట్ చేశారు.

ప్రస్తుతం అజయ్.. 'మహాసముద్రం' సినిమా తీసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా నటించనున్నారు. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత షూటింగ్ ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నారు.

అయితే ఇటీవలే కరోనా నుంచి కోలుకున్నారు దర్శకధీరుడు రాజమౌళి. ఈయన తర్వాత వైరస్​ సోకిన తెలుగు డైరెక్టర్ అజయ్ భూపతినే.

ABOUT THE AUTHOR

...view details