తమిళ స్టార్ హీరో ధనుష్‌కు 'అవెంజర్స్ ఎండ్ గేమ్'(Avengers endgame) ఫేమ్ హాలీవుడ్ స్టార్ దర్శక ద్వయం రూసో బ్రదర్స్ శుభాకాంక్షలు తెలిపారు. అతడు నటించిన 'జగమే తంత్రం'(jagame thanthiram) విడుదల సందర్భంగా 'సూపర్ ద తంబీ' అంటూ ట్వీట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన గ్యాంగ్‌స్టర్ డ్రామా 'జగమే తంత్రం' జూన్ 18న ఓటీటీలో విడుదలైంది. ఈ సినిమా ఎక్కువభాగం లండన్ నేపథ్యంలో సాగుతుంది. ఇందులో ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్గా నటించింది.
శేఖర్ కమ్ములతోనూ..
మరోవైపు ధనుష్(Dhanush) తెలుగులో నేరుగా ఓ సినిమా చేసేందుకు అంగీకారం తెలిపారు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించనున్నారు. శుక్రవారం ఈ ప్రాజెక్టను అధికారికంగా ప్రకటించారు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.