తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఉక్రెయిన్ అధ్యక్షుడిపై సమంత ఆసక్తికర పోస్ట్ - Samantha on Volodymyr Zelensky

ఇప్పుడు ఎవరి నోట విన్నా.. ఉక్రెయిన్ రష్యా యుద్ధం గురించే వినిపిస్తోంది. ఉక్రెయిన్​కు మద్ధతుగా నిలుస్తూ.. రష్యా చర్యను తప్పుపడుతున్నారు. ఈ విషయమైన తాజాగా టాలీవుడ్​ నటి సమంత స్పందించింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్​ జెలెన్​స్కీని ఉద్దేశించి ఆసక్తికర పోస్ట్​ పెట్టింది.

Russia attack Ukraine Actress Samantha
Russia attack Ukraine Actress Samantha

By

Published : Feb 28, 2022, 10:00 PM IST

ఉక్రెయిన్​పై రష్యా దాడిని ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ యుద్ధంలో సైనికులతోపాటు సాధారణ ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోతుండటం వల్ల సినీ ప్రముఖులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉక్రెయిన్​కు మద్దతుగా సోషల్​ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇదే విషయమై రెండు రోజుల క్రితం స్పందించిన ప్రముఖ నటి సమంత.. తాజాగా ఇన్​స్టా స్టోరీస్​లో ఓ పోస్టు షేర్​ చేసింది. తన దేశం కోసం బలంగా నిలబడిన ఉక్రెయిన్​ అధ్యక్షుడు వొలొదిమిర్​ జెలెన్​స్కీపై ప్రశంసలు కురిపించింది.

సమంత పోస్ట్​

'వొలొదిమిర్​ జెలెన్​స్కీ కోసం దేవుడిని ప్రార్థిస్తున్నాం. యోధుడైన ఉక్రెయిన్​ అధ్యక్షుడిని చరిత్ర కనిపెట్టింది. ఆయన తెగువ, ధైర్యసాహసాలే దానికి సాక్ష్యం' అని ఉన్న న్యూస్ ఆర్టికల్​కు సంబంధించిన స్క్రీన్​ షాట్​ను సమంత షేర్​ చేసింది.

రష్యా ముప్పేట దాడి చేస్తున్నా.. తన ప్రజలకు ధైర్యం చెబుతూ.. శత్రువులకు వెన్ను చూపకుండా ధీరుడులా పోరాడుతున్నా జెలెన్​స్కీని అంతర్జాతీయ సమాజం ప్రశంసిస్తోంది. ఉక్రెయిన్​ మద్దతుగా నిలుస్తోంది. ​

ఇదీ చూడండి:ఉపగ్రహానికి హీరో పునీత్ పేరు- ప్రభుత్వ బడి విద్యార్థులే రూపకర్తలు!

ABOUT THE AUTHOR

...view details