తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'యూపీ వాడికి తెలుగువాడు యముడిలా కనిపిస్తున్నాడా'

బాలకృష్ణ, వేదిక, సోనాల్ చౌహాన్ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం 'రూలర్'. తాజాగా ఈ సినిమా రెండో ట్రైలర్​ను విడుదల చేసింది చిత్రబృందం.

బాలకృష్ణ
rule

By

Published : Dec 15, 2019, 8:10 PM IST

బాలకృష్ణ హీరోగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'రూలర్'. తాజాగా ఈ సినిమా రెండో ట్రైలర్​ను విడుదల చేసింది చిత్రబృందం. బాలయ్య డైలాగ్​లు, యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి.

పవర్‌ఫుల్‌ యాక్షన్‌ సన్నివేశాలతో ఈ ప్రచార చిత్రాన్ని రూపొందించారు. "ఏరా.. యూపీ వాడికి తెలుగు వాడు యముడిలా కనిపిస్తున్నాడా?", "సామాన్యుడు కూడా బందిపోట్లు, దారి దోపిడీలకు అలవాటు పడుతున్నాడంటే కారణం ఆకలి.. ముందు ఆ ఆకలిని చంపాలి", "ఈ పొలిటికల్‌ పవర్‌ నువ్వు తీసుకున్న డిగ్రీ అనుకున్నావా.. నువ్వు చచ్చే వరకూ నీతో ఉంటుందనుకోవడానికి.. ఎలక్షన్‌.. ఎలక్షన్‌కి పవర్‌ కట్‌ అయిపోద్ది రా.." అనే డైలాగ్​లు అలరిస్తున్నాయి.

ఈ సినిమాలో వేదిక, సోనాల్‌ చౌహాన్‌ కథానాయికలు. జయసుధ, భూమిక, ప్రకాశ్‌రాజ్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సీకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సి. కల్యాణ్‌ నిర్మిస్తున్నారు. డిసెంబరు 20న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇవీ చూడండి.. వరల్డ్ ఫేమస్ లవర్​.. దేవరకొండ లుక్స్ ఇదిగో

ABOUT THE AUTHOR

...view details