బాలకృష్ణ నటించిన కొత్త చిత్రం రూలర్. డిసెంబరు 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, బాలయ్య స్టిల్స్‌తో ప్రేక్షకుల్లో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సందర్భంగా చిత్రబృందం ముఖాముఖి నిర్వహించింది.
ఫ్రెంచ్లుక్తో, పొడవు జుట్టుతో రెండు వైవిధ్యమైన లుక్‌ల్లో కనిపించి ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తున్నాడు బాలయ్య. అందరూ తనను ఐరన్ మ్యాన్ ఫేమ్ టోనీ స్టార్క్‌లా ఉన్నానని అంటున్నారని బాలకృష్ణ చెప్పాడు.