తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మండే సూర్యుడిలా వచ్చిన బాలయ్య - ruler first song

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో వస్తోన్న చిత్రం 'రూలర్'. ఈ సినిమాలోని మొదటి పాటను విడుదల చేసింది చిత్రబృందం.

ruler
బాలకృష్ణ

By

Published : Dec 1, 2019, 11:53 AM IST

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్లుగా తెరకెక్కుతోన్న చిత్రం 'రూలర్'. కేయస్‌ రవికుమార్‌ దర్శకుడు. ఇప్పటికే టీజర్​, పోస్టర్లతో ప్రేక్షకుల్లో అంచనాలు పెంచిన చిత్రబృందం.. తాజాగా ఇందులోని మొదటి పాటను విడుదల చేసింది.

'అడుగడుగో యాక్షన్​ హీరో' అంటూ సాగే పాటకు చిరంతన్ అందించిన సంగీతం ఆకట్టుకునేలా ఉంది. సాయి చరణ్​ ఆలపించాడు. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్​ అలరించేలా ఉన్నాయి.

బాలయ్య, చిరంతన్ కాంబినేషన్​లో ఇది మూడవ చిత్రం. ఇంతకుముందు ‘గౌతమిపుత్ర శాతకర్ణి’, ‘జైసింహ’ సినిమాలకూ స్వరాలు సమకూర్చాడీ సంగీతం దర్శకుడు. సి.కల్యాణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమా ఈనెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవీ చూడండి.. ఎవర్​గ్రీన్ క్లాసిక్ 'ఈ మనసే' మరోసారి..

ABOUT THE AUTHOR

...view details