తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'రూలర్​' టీజర్​తో అదరగొట్టిన బాలకృష్ణ - బాలకృష్ణ సినిమాలు

హీరో బాలకృష్ణ.. 'రూలర్​' సినిమా టీజర్​ అలరిస్తోంది. ఈ కథానాయకుడు రెండు పాత్రల్లో సందడి చేస్తున్నాడు. వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

'రూలర్​' టీజర్

By

Published : Nov 21, 2019, 4:58 PM IST

Updated : Nov 21, 2019, 5:41 PM IST

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న చిత్రం 'రూలర్'. ఇందులో ధర్మ అనే పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే ఫస్ట్​లుక్, ఇతర పోస్టర్​లతో అంచనాలు పెంచిన చిత్రబృందం.. టీజర్​ను గురువారం విడుదల చేసింది. రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తూ బాలకృష్ణ అలరిస్తున్నాడు.

"ఒంటి మీద ఖాకీ యూనిఫామ్ ఉంటే బోనులో పెట్టిన సింహంలా ఉంటాను...యూనిఫామ్ తీశానో బయటికి వచ్చిన సింహంలా ఆగను... ఇక వేటే" అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్​ ఆకట్టుకుంటోంది

హీరోయిన్లుగా​ సోనాల్ చౌహాన్, వేదిక నటిస్తున్నారు. ప్రకాశ్​రాజ్, భూమిక ఇతర పాత్రలు పోషిస్తున్నారు. చిరంతన్ భట్ సంగీతమందిస్తున్నాడు. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. సి.కల్యాణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వచ్చే నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఇది చదవండి: బాలకృష్ణ యంగ్​ లుక్​.. జోష్​లో అభిమానులు

Last Updated : Nov 21, 2019, 5:41 PM IST

ABOUT THE AUTHOR

...view details