Rudra Trailer: బాలీవుడ్ సూపర్‌స్టార్ అజయ్ దేవ్‌గణ్ వెబ్‌సిరీస్‌లోకి అరంగేట్రం చేశారు. 'రుద్ర- ది ఎండ్ ఆఫ్ డార్క్నెస్' అనే సిరీస్‌లో నటిస్తున్నారు. శనివారం విడుదలైన ట్రైలర్.. సిరీస్‌పై అంచనాలను పెంచేస్తోంది. అజయ్ సరసన రాశీఖన్నా నటిస్తోంది. బ్రిటిష్ షో 'లూథర్' ఆధారంగా తెరకెక్కుతున్న ఈ థ్రిల్లర్‌లో డీసీపీ రుద్రవీర్ సింగ్ అనే పవర్ఫుల్ పోలీస్ పాత్రలో అలరించనున్నారు అజయ్. ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వేదికగా ఈ సిరీస్ ప్రసారంకానుంది.
'బంగార్రాజు' స్పెషల్ సాంగ్..
అక్కినేని నాగార్జున, ఆయన తనయుడు నాగచైతన్య నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'బంగార్రాజు'. సుమారు ఐదేళ్ల క్రితం వచ్చిన 'సోగ్గాడే చిన్నినాయన'కు సీక్వెల్‌గా ఈ సినిమా రూపుదిద్దుకుంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ సొంతం చేసుకుంది. సినిమాపై ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణకు ధన్యవాదాలు చెబుతూ.. నాగార్జున సర్‌ప్రైజ్ ఇచ్చారు. 'బంగార్రాజు' నుంచి 'నువ్వు సిగ్గుపడుతుంటే' అనే పాటను ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు. కల్యాణ్‌కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రమ్యకృష్ణ, కృతిశెట్టి కీలకపాత్రలు పోషించారు.
'జయహో రామానుజ' మూవీ లోగో విడుదల
'ఆర్ఆర్ఆర్'లో ఒలివియా మోరిస్
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి:'ఆర్ఆర్ఆర్', 'రాధేశ్యామ్' రిలీజ్ డేట్స్.. దిల్‌రాజు బిగ్ న్యూస్!