'ఆర్ఆర్ఆర్' చిత్రం అనుకున్న రోజే తీసుకొస్తాం, వాయిదా అవాస్తవం అని నిర్మాత డీవీవీ దానయ్య తెలిపారు. కరోనా కారణంగా సినిమా చిత్రీకరణ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో 'ఆర్‌ఆర్‌ఆర్' విడుదల తేదీ మారే అవకాశాలున్నాయని వార్తలొచ్చాయి. ఇటీవలే ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పందించిన దానయ్య ఈ విషయమై క్లారిటీ ఇచ్చారు.
'వాయిదా లేదు.. అనుకున్న సమయానికే వస్తాం' - RRR will not postpone
కరోనా దెబ్బతో సినిమా షూటింగ్‌లన్నీ వాయిదా పడ్డాయి. భారీ మల్టీస్టారర్ చిత్రం 'ఆర్ఆర్ఆర్' కూడా షూటింగ్‌ను నిలిపివేసింది. ఈ చిత్రీకరణ ఆలస్యం కావడం వల్ల సినిమా మళ్లీ వాయిదా పడుతుందనే వార్తలు వచ్చాయి. ఈ విషయమై స్పందించారు నిర్మాత డీవీవీ దానయ్య.
"ఇప్పటికే 75శాతం షూటింగ్ పూర్తయింది. గ్రాఫిక్స్ కూడా చివరి దశలో ఉంది. మిగిలిన షెడ్యూల్ త్వరలోనే పూర్తి చేసి 2021 జనవరి 8న వస్తాం" అని స్పష్టం చేశారు దానయ్య.
రామ్ చరణ్, ఎన్టీఆర్ కథానాయకులుగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఇటీవలే 'రౌద్రం రణం రుధిరం' టైటిల్‌తోపాటు, అల్లూరి సీతారామరాజుగా చెర్రీ ఎలా ఉంటాడో చూపించింది చిత్రబృందం. త్వరలోనే కొమురం భీంగా తారక్ లుక్‌ను విడుదల చేసే అవకాశాలున్నాయి. ఆలియా భట్, ఒలివియా మోరిస్ కథానాయికలు. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.