RRR release date: 'ఆర్ఆర్ఆర్'.. థియేటర్లలోకి రావడానికి మరో రెండు వారాల సమయముంది. చిత్రబృందం నేషనల్ వైడ్ ప్రచారంలో బిజీగా ఉంది. మరోవైపు సినిమా ఎప్పుడొస్తుందా అని అభిమానుల మనసులో ఆత్రుతగా ఉంది. ఇన్ని విషయాల మధ్య 'ఆర్ఆర్ఆర్' చిత్రం అరుదైన ఘనత సాధించింది.
యూఎస్‌లో 'ఆర్ఆర్ఆర్' సరికొత్త రికార్డు సృష్టించింది. రిలీజ్‌కు ముందే మిలియన్ డాలర్లు వసూళ్లు అందుకున్న సినిమాగా నిలిచింది. ఈ ఘనత సాధించిన తొలి భారత చిత్రం ఇదే కావడం విశేషం. యూఎస్‌లో జనవరి 6న 'ఆర్ఆర్ఆర్' ప్రీమియర్స్ వేయనున్నారు.