దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న 'ఆర్‌ఆర్‌ఆర్' చిత్రం నుంచి మరో అప్డేట్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదివరకే 70 శాతం చిత్రీకరణ పూర్తయినట్లు చిత్రబృందం వెల్లడించింది. అయితే రామ్‌చరణ్, జూ.ఎన్టీఆర్‌తో పాటు అజయ్ దేవగణ్ కలిసి ఉన్న సీన్లు ప్రస్తుతం చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా చిత్రబృందం జక్కన్నతో ఈ ముగ్గురూ కలిసి తీసుకున్న ఫొటోను విడుదల చేసింది.
ఆర్‌ఆర్‌ఆర్ సర్ప్రైజ్: ఒకే ఫ్రేములో నలుగురు స్టార్లు - RRR latest news
ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్'. టాలీవుడ్ అగ్రకథానాయకులు రామ్‌చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్, హలీవుడ్ తారలు సందడి చేయనున్నారు. తాజాగా జక్కన్నతో కలిసి చెర్రీ, తారక్, హిందీ నటుడు అజయ్ దేవగణ్ కలిసి తీసుకున్న ఫొటోను అభిమానులతో పంచుకుంది చిత్రబృందం.
![ఆర్‌ఆర్‌ఆర్ సర్ప్రైజ్: ఒకే ఫ్రేములో నలుగురు స్టార్లు RRR Update: four stars are shining bright on the sets of #RRR](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5887253-518-5887253-1580306036470.jpg)
ఆర్‌ఆర్‌ఆర్ సర్ప్రైజ్: నలుగురు స్టార్లు ఒకే ఫ్రేములో...
చరణ్ అల్లూరి సీతారామరాజుగా, తారక్ కొమరం భీమ్‌గా కనిపించునున్నారు. వీరి సరసన ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్ దేవగణ్ పాత్రపై ఇప్పటికీ క్లారిటీ లేదు. ఇద్దరు సూపర్ హీరోల కలిస్తే ఎలా ఉంటుంది అనే కల్పిత కథతో ఈ సినిమాను తీస్తున్నారు. భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. కీరవాణి బాణీలు సమకూరుస్తున్నాడు. సినిమా ఈ ఏడాది జులై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Last Updated : Feb 28, 2020, 10:36 AM IST