తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆర్​ఆర్​ఆర్', 'పుష్ప' ​స్పూఫ్​.. చూస్తే వావ్​​ అనాల్సిందే! - pushpa trailer spoof

RRR trailer Spoof: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్​స్టార్ రామ్​చరణ్ కథానాయకులుగా తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం 'ఆర్ఆర్ఆర్'. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ట్రైలర్​ గతేడాది విడుదలై ఆకట్టుకుంది. అయితే కొందరు ఔత్సాహికులు ఈ ట్రైలర్​ స్పూఫ్ చేసి నెటిజన్లను ఆకట్టుకున్నారు. దీంతోపాటు 'పుష్ప' ట్రైలర్​ స్పూఫ్ కూడా చేసి అలరించారు.​ వారి పనితీరును మెచ్చుకుంటూ చిత్రబృందం కూడా ప్రశంసించింది. ఆ వీడియోలను మీరు చూసేయండి...

RRR trailer spoof
ఆర్​ఆర్​ఆర్​ ట్రైలర్​ స్పూఫ్​

By

Published : Jan 12, 2022, 3:10 PM IST

RRR trailer Spoof: తమకు సినిమాలపై ఉన్న అభిమానాన్ని ఒక్కక్కరు ఒక్కో విధంగా చాటుకుంటుంటారు. కొందరు పాటల పేరడీలు, మరికొందరు యాక్షన్‌ సన్నివేశాల రీ క్రియేషన్‌తో నెట్టింట సందడి చేస్తుంటారు. తమ ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంటుంటారు. ఈ బాటలోనే నడిచిన ఒడిశాకు చెందిన కొందరు యువకులు 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమా ట్రైలర్‌ స్పూఫ్‌తో వావ్‌ అనిపిస్తున్నారు. రామ్‌చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ కథానాయకులుగా రాజమౌళి తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రమే 'ఆర్‌ఆర్‌ఆర్‌- రౌద్రం రణం రుధిరం'. గతేడాది విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌ యావత్‌ సినీ ప్రపంచాన్ని మెప్పించింది. అందులోని లొకేషన్లు, పోరాట ఘట్టాలు, నటీనటుల హావభావాలు ప్రేక్షకుల్ని కట్టిపడేశాయి. దానికి స్పూఫ్‌ను చేసిన యువకులు తమ యూట్యూబ్‌లో ఛానల్‌లో సంబంధిత వీడియోను అప్‌లోడ్‌ చేశారు. ఆ లింక్‌ను ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్​గా మారింది. ఈ వీడియోను చూసిన 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్ర బృందం వారిని ప్రశంసించింది. తమ కష్టానికి, సినిమాపై ఉన్న ప్రేమకు ధన్యవాదాలు తెలియజేసింది.

'ఆర్‌ఆర్‌ఆర్‌' ట్రైలర్‌లో చూపించిన ప్రతి ఫ్రేమ్‌ను వారు తమదైన శైలిలో తెరకెక్కించి అబ్బురపరిచారు. తామెంత కష్టపడ్డారో వీడియో చివర్లో తెలియజేశారు. ఈ యువకులు ఇప్పుడే కాదు గతంలోనూ పలు సూపర్‌ హిట్‌ చిత్రాలకు సంబంధించి కొన్ని స్పూఫ్‌లు చేశారు. 'పుష్ప', '3 ఇడియట్స్‌', 'అంతిమ్‌' తదితర సినిమాల ట్రైలర్‌లను రీ క్రియేట్‌ చేసి ఆకట్టుకున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఓ లుక్కేయండి..

ఇదీ చూడండి:చిరు కొత్త సినిమాలో రవితేజ గెస్ట్ రోల్ కన్ఫర్మ్!

ABOUT THE AUTHOR

...view details