తెలంగాణ

telangana

ETV Bharat / sitara

RRR trailer: 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ రికార్డుల మోత - ఆర్ఆర్ఆర్ రామ్​చరణ్ ఎన్టీఆర్

RRR trailer record: 'ఆర్ఆర్ఆర్' సినిమా రోజురోజుకు అంచనాలు పెంచేస్తుంటే.. మరోవైపు ట్రైలర్​ రికార్డుల మోత మోగిస్తోంది. రిలీజైన 24 గంటల్లో దేశంలోనే ఎక్కువ వ్యూస్ సాధించిన ట్రైలర్​గా నిలిచి ఘనత సాధించింది.

RRR Trailer
ఆర్ఆర్ఆర్ ట్రైలర్

By

Published : Dec 10, 2021, 12:04 PM IST

RRR movie trailer: 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్.. యూట్యూబ్​లో​ రికార్డులు సృష్టిస్తూ దూసుకెళ్తోంది. ప్రేక్షకులను అలరిస్తూ సినిమాపై అంచనాల్ని పెంచేస్తోంది. రామ్​చరణ్, ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజన్స్​ అయితే గూస్​బంప్స్ తెప్పిస్తోంది.

గురువారం ఉదయం 10 గంటలకు థియేటర్లలో 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్​ విడుదల చేయగా, ఆ తర్వాత కొద్దిసేపటికే యూట్యూబ్​లో పోస్ట్​ చేశారు. ఇక అప్పటినుంచి జైత్రయాత్ర మొదలైంది. వ్యూస్​, లైక్స్​ పరంగా సరికొత్త రికార్డులు సృష్టించింది.

ఆర్ఆర్ఆర్ ట్రైలర్​లోని సీన్స్

ఆర్ఆర్ఆర్ ట్రైలర్.. విడుదలైన 24 గంటల్లో అన్ని భాషల్లో కలిపి 50 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. తెలుగులో 20.45 మిలియన్ వ్యూస్, హిందీలో 19 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో మిగతా వ్యూస్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. తద్వారా ఈ అరుదైన ఘనత సాధించిన తొలి తెలుగు ట్రైలర్​గా 'ఆర్ఆర్ఆర్' నిలిచింది.

RRR movie: ట్రైలర్​ వ్యూస్ ఇచ్చిన ఊపులోనే సినిమాను మరింతగా ప్రమోట్​ చేయాలని చిత్రబృందం భావిస్తోంది. అందులో భాగంగానే ముంబయిలో గురువారం ఉదయం ఈవెంట్​ నిర్వహించారు. హైదరాబాద్​లో సాయంత్రం జరగాల్సింది కానీ అనివార్య కారణాల వల్ల అది రద్దయింది. శుక్రవారం.. బెంగళూరు, చెన్నైలో 'ఆర్ఆర్ఆర్' ప్రచార కార్యక్రమాలు జరగనున్నాయి.

ఆర్ఆర్ఆర్ మూవీలో రామ్​చరణ్-ఎన్టీఆర్

భారీ బడ్జెట్​తో తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్' సినిమాలో రామ్​చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్​గా నటించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్​ హీరోయిన్లు. అజయ్​ దేవ్​గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలకపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతమందించారు. రాజమౌళి దర్శకత్వం వహించారు. డీవీవీ దానయ్య.. దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్​తో ఈ సినిమా నిర్మించారు. జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఇది విడుదల కానుంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details