తెలంగాణ

telangana

ETV Bharat / sitara

RRR trailer: 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్​ రిలీజ్ వాయిదా - ఆర్ఆర్​ఆర్ రామ్​చరణ్ ఎన్టీఆర్

RRR trailer: అనుకోని పరిస్థితుల వల్ల 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్​ రిలీజ్​'ఆర్ఆర్ఆర్' ట్రైలర్​ రిలీజ్ వాయిదా పడింది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ట్వీట్ చేసింది.

RRR trailer
ఆర్ఆర్ఆర్ ట్రైలర్

By

Published : Dec 1, 2021, 9:41 AM IST

Updated : Dec 1, 2021, 10:12 AM IST

RRR trailer: 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్​ విడుదలను వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం బుధవారం(డిసెంబరు 1) ప్రకటించింది. అనుకోని పరిస్థితుల వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొంది. త్వరలో కొత్త రిలీజ్​ డేట్​ను ప్రకటిస్తామని ట్వీట్ చేసింది.

RRR movie: డిసెంబరు 3న 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్​ విడుదల చేస్తామని ఇటీవల ప్రకటించారు. ఇప్పుడు ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణంతో టాలీవుడ్​లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇందువల్లే 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ విడుదలను వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

ఊపిరితిత్తుల క్యాన్సర్​తో గత కొన్నాళ్లుగా బాధపడుతున్న సిరివెన్నెల.. మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయనకు తెలుగు సినీ ప్రముఖులు నివాళులర్పించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ఇక 'ఆర్ఆర్ఆర్' విషయానికొస్తే రామ్​చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. అజయ్ దేవ్​గణ్, సముద్రఖని, శ్రియ కీలకపాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీతమందిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. డీవీవీ దానయ్య.. దాదాపు రూ.450 కోట్లతో నిర్మించారు. జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి విడుదల కానుందీ సినిమా.ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలో కొత్త రిలీజ్ డేట్​ను ప్రకటిస్తామని అన్నారు.

ఆర్ఆర్ఆర్ మూవీ

ఇవీ చదవండి:

Last Updated : Dec 1, 2021, 10:12 AM IST

ABOUT THE AUTHOR

...view details