తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆర్​ఆర్​ఆర్'​ భీమ్​ గ్లింప్స్​.. చిరు 'భోళాశంకర్'​ అప్డేట్​ - Bigboss sohel ananya nagalla movie

కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చాయి. ఇందులో రాజమౌళి 'ఆర్​ఆర్​ఆర్'​, చిరంజీవి 'భోళాశంకర్​' సహా పలు చిత్రాల వివరాలు ఉన్నాయి.

ఆర్​ఆర్​ఆర్​ ట్రైలర్​, RRR trailer
ఆర్​ఆర్​ఆర్​ ట్రైలర్​

By

Published : Dec 8, 2021, 1:14 PM IST

RRR Trailer: డిసెంబరు 9న 'ఆర్​ఆర్​ఆర్'​ ట్రైలర్​ విడుదల కానున్న నేపథ్యంలో ఈ ప్రచార చిత్రానికి సంబంధించిన గ్లింప్స్​ను విడుదల చేస్తూ ఫ్యాన్స్​కు సర్​ప్రైజ్​ ఇస్తోంది చిత్రబృందం.​ మంగళవారం రామ్​చరణ్​కు(రామ్​ పాత్ర) సంబంధించిన గ్లింప్స్​ను ఎన్టీఆర్​ విడుదల చేయగా.. నేడు(బుధవారం) తారక్​కు(కొమురం భీమ్​) సంబంధించిన గ్లింప్స్​ను రిలీజ్​ చేశారు చరణ్​. ఈ రెండు ట్రైలర్​పై అంచనాలను పెంచుతున్నాయి. రాజమౌళి తెరక్కించిన ఈ సినిమాలో అజయ్​దేవగణ్​, శ్రియ, ఆలియాభట్​ కూడా కీలక పాత్ర పోషించారు. ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Chiranjeevi Bholashankar movie: మెగాస్టార్​ చిరంజీవి నటిస్తున్న సినిమాల్లో 'భోళాశంకర్'​ ఒకటి. ఈ చిత్రంలోని ఓ స్టైలిష్​ ఫైట్​ సీక్వెన్స్​, ఓ సాంగ్​ చిత్రీకరణను పూర్తిచేసుకున్నట్లు తెలిపింది చిత్రబృందం. రెండో షెడ్యూల్​ను ప్రారంభించినట్లు పేర్కొంది. ఈ మూవీని దర్శకుడు మెహర్​రమేశ్​ తెరకెక్కిస్తుండగా.. హీరోయిన్​గా తమన్నా నటిస్తోంది. కీర్తిసురేశ్​ చిరుకు సోదరిగా నటించనుంది.

చిరంజీవి భోళాశంకర్​ షూటింగ్​

Bigboss sohel: బిగ్​బాస్​ ఫేమ్​ సోహైల్​, అనన్య నాగళ్ల జంటగా ఓ కొత్త సినిమా షూటింగ్​ ప్రారంభమైంది. పూజాకార్యక్రమాలతో లాంఛనంగా చిత్రీకరణను ప్రారంభించారు. ఈ మూవీకి 'బూట్​కట్​ బాలరాజు' అనే టైటిల్​ను ఖరారు చేశారు. తొలి షాట్​కు అనిల్​రావిపూడి దర్శకత్వం వహించగా.. నిర్మాత మిర్యాల రవీందర్​ కమెరా స్విచ్​ ఆన్​ చేశారు. దిల్​రాజ్​ కూడా పాల్గొన్నారు. ఈ సినిమాకు శ్రీకోనేటి దర్శకత్వం వహిస్తున్నారు.

బూట్​కట్​ బాలరాజు సినిమా షూటింగ్​ ప్రారంభం
బూట్​కట్​ బాలరాజు సినిమా షూటింగ్​ ప్రారంభం

ఇదీ చూడండి: శాన్వీ శ్రీవాస్తవ మైండ్​ బ్లాక్​ అందాలు!

ABOUT THE AUTHOR

...view details