తెలంగాణ

telangana

ETV Bharat / sitara

RRR Trailer Launch: 'హాలీవుడ్ ఛాన్స్​ వచ్చినా.. అలానే చేస్తా' - ఆర్​ఆర్​ఆర్​ ట్రైలర్ న్యూస్

RRR Trailer Launch: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ఆర్​ఆర్​ఆర్​. గురువారం విడుదలైన ఈ చిత్ర ట్రైలర్.. ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోంది. అయితే.. ఈ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన రాజమౌళి పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

rajamouli
రాజమౌళి

By

Published : Dec 10, 2021, 5:40 AM IST

RRR Trailer Launch: మెగా పవర్​స్టార్ రామ్​చరణ్- జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన భారీ యాక్షన్ ఎంటర్​టైనర్​ 'ఆర్​ఆర్​ఆర్'. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం. ఈ సందర్భంగా గురువారం ముంబయి వేదికగా సినిమా ట్రైలర్​ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ నేపథ్యంలో మాట్లాడిన రాజమౌళి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఒకవేళ హాలీవుడ్ ఛాన్స్​ వస్తే ఏం చేస్తారు? అని అడగ్గా.. రాజమౌళి ఆసక్తికరంగా సమాధానం ఇచ్చారు. 'నిజం చెప్పాలంటే నేను అసలు హాలీవుడ్ అవకాశాలనే స్వీకరించను. నాకు భారతీయ చిత్రాలు తీయడమంటేనే ఇష్టం. ఒకవేళ ఇతర ఇండస్ట్రీ వాళ్లు నాకు సినిమా ఆఫర్​ ఇచ్చినా నేను భారతీయ కథాంశం ఉన్న సినిమానే తీస్తాను.' అని జక్కన్న చెప్పారు.

బాలీవుడ్, దక్షిణాది ఇండస్ట్రీల మధ్య ఉన్న అనుబంధంపై కూడా రాజమౌళి మాట్లాడారు. 'ఉత్తరాది నటులు మాత్రమే బాలీవుడ్​లో చేయాలి. దక్షిణాది నటులు మాత్రమే సౌత్​ ఇండస్ట్రీలో చేయాలనే మాటల్లో అర్థం లేదు. నటనకు బాషతో పనిలేదు. చాలా మంది నటులు కొత్త పాత్రల్లో నటించాలని అనుకుంటారు. ఇతర బాషల్లో నటించడం ఛాలెంజింగ్​గా భావిస్తారు. భవిష్యత్తులో విభిన్న నటుల కలయికతో మరిన్ని చిత్రాలు వస్తాయి.' అని రాజమౌళి తెలిపారు.

కాగా, ఆర్​ఆర్​ఆర్​ చిత్రంలో బాలీవుడ్, హాలీవుడ్​ నటులు కూడా ఉన్నారు. ఈ చిత్రం తెలుగు, మలయాళం, కన్నడ, తమిళ్, హిందీ సహా విదేశీ బాషల్లోనూ విడుదలవుతోంది. బాలీవుడ్​కు చెందిన పెన్​ స్టూడియోస్ ఈ చిత్ర హిందీ రైట్స్​ను సొంతం చేసుకుంది.

దర్శకుడు రాజమౌళి, తారక్, బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్​గణ్​, నటి ఆలియా బట్ ట్రైలర్ విడుదల కార్యక్రమానికి హాజరయ్యారు. రామ్​చరణ్​ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఈ కార్యక్రమానికి రాలేకపోయారు.

ఇదీ చదవండి:

నాటు నాటు స్టెప్.. రాజమౌళి వల్ల ఎన్టీఆర్​కు​ కష్టాలు!

రాజమౌళి డైరెక్షన్​ను డామినేట్​ చేసిన ఓన్లీ హీరో అతడు!

ABOUT THE AUTHOR

...view details