తెలంగాణ

telangana

ETV Bharat / sitara

RRR movie: కుంభస్థలాన్ని బద్దలుకొడదాం రా! - RRR review

ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమా ట్రైలర్ రిలీజైంది. ముంబయిలో జరిగిన ఈ ఈవెంట్​లో చిత్రబృందం పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

RRR trailer launch press meet
ఆర్ఆర్ఆర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్

By

Published : Dec 10, 2021, 6:28 AM IST

Updated : Dec 10, 2021, 7:49 AM IST

RRR trailer: ఎప్పుడెప్పుడా అని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్న 'ఆర్‌ఆర్‌ఆర్‌' విడుదల సమయం దగ్గర పడుతోంది. చిత్రబృందం ప్రచార పర్వానికి తెర లేపింది. గురువారం ట్రైలర్‌ విడుదల చేశారు. అందులో ఎన్టీఆర్‌ పులిలా గర్జించి విరుచుకుపడగా.. రామ్‌చరణ్‌ అగ్గి పిడుగులా చెలరేగిపోయాడు. బాక్సాఫీస్‌ కుంభస్థలాన్ని కొట్టడమే వీరి లక్ష్యం అన్నట్టుగా జోరు చూపించారు. ప్రేక్షకుల్లో అంచనాల్ని మరింత పెంచేశారు. 'ఆర్‌ఆర్‌ఆర్‌' ట్రైలర్‌ విడుదల కోసం చిత్రబృందం గురువారం ముంబయి వెళ్లింది. కథానాయకుడు ఎన్టీఆర్‌, దర్శకుడు రాజమౌళి, నాయిక అలియాభట్‌, నిర్మాత రాజమౌళి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని చిత్రబృందం చెప్పిన విషయాలివీ...

*నా దాహార్తిన్ని తీర్చే దర్శకుడు: ఎన్టీఆర్‌

Ntr RRR: "కొత్తగా ఏదైనా చేయాలనుకున్న ప్రతీసారీ నటుడిగా నా దాహార్తిని తీర్చే దర్శకుల్లో రాజమౌళి ఒకరు. ఆయన నాకు దర్శకుడే కాదు, సన్నిహిత మిత్రుడు కూడా. 'ఆర్‌ ఆర్‌ ఆర్‌'లో భాగం కావడం వల్ల నటుడిగా నాకు మరెన్నో తలుపులు తెరుచుకున్నాయి. నటుడు సౌకర్యవంతమైన స్థానంలో ఉండకూడదని నమ్ముతాను. ప్రతీసారీ నన్ను అలాంటి స్థానం నుంచి బయటకు తీసుకొచ్చే దర్శకుల్లో రాజమౌళి ఒకరు. నేను అజయ్‌ దేవగణ్‌తో కలిసి తెరను పంచుకోలేదు కానీ, ఆయనతో కలిసి సెట్స్‌లో గడిపిన క్షణాల్ని మాత్రం ఆస్వాదించా. అజయ్‌ దేవగణ్‌ సినిమాలు చూస్తూ పెరిగాను. నేను ఆయనతో పనిచేస్తున్నప్పుడు ఒక గురువుతో కలిసి పనిచేసినట్టే భావిస్తా. నేనెన్ని సినిమాలు చూసినా 'ఫూల్‌ ఔర్‌ కాంటే'లో రెండు బైక్‌లపై నిలబడి చేసిన యాక్షన్‌ ఘట్టాలు చూసినప్పుడు ముగ్ధుడినయ్యా. అలా ప్రయత్నించాలని ఉందని మా అమ్మతో చెప్పినప్పుడు ‘అవి సినిమాల్లో మాత్రమే జరుగుతాయ’ని వారించేది. ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’లో ఆయన భాగం కావడం ఎంతో ఆనందాన్నిచ్చింది".

ఆర్ఆర్ఆర్ మూవీ

* అందుకే ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ఎంపిక: ఎస్‌.ఎస్‌.రాజమౌళి

RRR rajamouli: "ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో నాకు తెలుసు. ‘బాహుబలి’ తర్వాత మళ్లీ అలాంటి సినిమా కావాలనే ప్రేక్షకులు అడుగుతారు. కానీ మళ్లీ మళ్లీ అవే సినిమాలు చేయలేం కదా! హీరోలు, దర్శకుల ఇమేజ్‌, వాళ్ల గత చిత్రాలు, ట్రైలర్లు ఇవన్నీ కూడా ప్రేక్షకుడిని థియేటర్‌కు తీసుకొచ్చేందుకు మాత్రమే ఉపయోగపడతాయి. వాళ్లు థియేటర్లలోకి అడుగుపెట్టాక రెండు మూడు నిమిషాలకే ప్రస్తుత సినిమాని చూడటం మొదలుపెడతారే తప్ప, గతంలో వచ్చిన సినిమాల్ని గుర్తు చేసుకోరు. ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ విషయంలో కథ, కథనంపై మరింతగా దృష్టిపెట్టాం. పాత్రలు, పాత్రల మధ్య అనుబంధం, సంఘర్షణ, భావోద్వేగాలపై దృష్టిపెట్టి చిత్రాన్ని తెరకెక్కించా. ప్రేక్షకుల దృష్టిలో ‘బాహుబలి’ లాంటి సినిమా అంటే.. ఆ స్థాయి భావోద్వేగాలతో కూడిన సినిమా అనే అర్థం. అందుకు తగ్గట్టే చిత్రాన్ని తెరకెక్కించాం. పాత్రల్ని దృష్టిలో ఉంచుకునే ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లని ఈ చిత్రం కోసం ఎంచుకున్నా. భీమ్‌ పాత్ర చేసే కొన్ని ఘట్టాల్ని కేవలం ఎన్టీఆర్‌ మాత్రమే చేయగలరు. రామ్‌చరణ్‌ మాత్రమే చూపించగల కొన్ని విషయాలు రామ్‌ పాత్రలో ఉంటాయి. అందుకే ఈ ఇద్దరినీ ఆ పాత్రల్లో నటింపజేశాం. వాళ్లని ఇతర దర్శకుల కంటే ప్రత్యేకంగా చూపించాలనుకున్నా. ఆ ప్రయత్నం ఈ సినిమాలో కనిపిస్తుంది".

* సంభాషణల్ని నేర్చుకున్నా: ఆలియాభట్‌

Alia bhatt RRR: "సీత పాత్ర కోసం నన్ను సంప్రదించగానే నాలో ఎంత ఉత్సాహం కలిగిందో, అంతగా నేను ఉద్వేగానికి గురయ్యా. అయితే భాష విషయంలోనే కొంచెం భయపడ్డా. నేను చెప్పే సంభాషణల్ని అర్థం చేసుకోవడం సహా వాటిని పూర్తిగా నేర్చుకుని పక్కాగా చెప్పాలని సన్నద్ధమయ్యా. ఆ తర్వాతే కెమెరా ముందుకు వెళ్లా. అయితే ఒక్కసారి నేను సెట్లోకి వెళ్లాక రాజమౌళి సర్‌ అన్నీ సిద్ధం చేసి, ప్రతిదీ సజావుగా సాగేలా చేశారు. తిరిగి చూసేసరికి సినిమా పూర్తి కావడం బాధగా అనిపించింది. భవిష్యత్తులో రాజమౌళి సర్‌తో మరిన్ని సినిమాలు చేయాలని ఉంది. 'గంగూబాయి కతియావాడి' సినిమా, 'ఆర్‌ ఆర్‌ ఆర్‌' ఒకేసారి వస్తాయేమో అని అందరూ అనుకున్నారు కానీ ఆ విషయంలో నేను భయపడలేదు. నేను దర్శకనిర్మాతల్ని నమ్ముతాను. సంజయ్‌ లీలా భన్సాలీ, రాజమౌళి సినిమాల్ని అర్థం చేసుకునే తీరు వేరేలా ఉంటుంది. అలియా వర్సెస్‌ అలియా అవుతుందేమో అనుకున్నా కానీ అలా జరగలేదు".

రాజమౌళిలా మరొకరు తీయలేరు: అజయ్‌ దేవగణ్‌

"రాజమౌళి తరహా సినిమాలు ఆయన మాత్రమే తీయగలరు. మరెవరైనా ప్రయత్నిస్తే అది చాలా కష్టం. ఆయన విజన్‌ ప్రత్యేకంగానే కాదు, ఉన్నతంగా కూడా ఉంటుంది. తన పాత్రల్ని రాసే విధానం, వాటిని మలిచే తీరు అద్భుతంగా ఉంటుంది".

ఇవీ చదవండి:

Last Updated : Dec 10, 2021, 7:49 AM IST

ABOUT THE AUTHOR

...view details