RRR movie: 'ఆర్ఆర్ఆర్'.. థియేటర్లలోకి రావడానికి ఇంకా చాలా రోజులు టైముంది. కానీ ఆ సినిమా ట్రైలర్ మాత్రం యూట్యూబ్లో రికార్డులు సెట్ చేస్తూ దూసుకెళ్తుంది. డిసెంబరు 9న ఆ ట్రైలర్ విడుదలవగా.. ప్రస్తుతం అది అన్ని భాషల్లో కలిపి 100 మిలియన్ వ్యూస్ సాధించింది. దేశంలోనే ఈ ఘనత సాధించిన తొలి సినిమా ఇదే కావడం విశేషం.
అలానే ఈ సినిమాతో తొలి పాన్ ఇండియా చిత్రం చేసిన ఎన్టీఆర్.. సొంతంగా హిందీలో డబ్బింగ్ కూడా చెప్పారు. ఈ విషయాన్ని బుధవారం ఓ ఫొటో పోస్ట్ చేసి వెల్లడించారు. ఇప్పటికే తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళంలోనూ తారక్ స్వయంగా డబ్బింగ్ చెప్పడం విశేషం.