తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆర్ఆర్ఆర్' కోసం రాజమౌళి పక్కా ప్లాన్! - RAM CHARAN NTR RRR

'ఆర్ఆర్ఆర్'ను చెప్పిన సమయానికే విడుదల చేయాలని రాజమౌళి కచ్చితంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్లునే త్వరగా షూటింగ్​ పూర్తి చేయాలని ప్రణాళికలు రచిస్తున్నారు.

RRR to be wrapped up by this time
ఆర్ఆర్ఆర్ మూవీ

By

Published : Feb 9, 2021, 5:30 AM IST

Updated : Feb 9, 2021, 11:51 AM IST

లాక్​డౌన్​ పూర్తయిన తర్వాత 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ నాన్​స్టాప్​గా జరుగుతుంది. ప్రస్తుతం క్లైమాక్స్​ను తెరకెక్కిస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే ఇటీవల విడుదల తేదీని అక్టోబరు 13గా ప్రకటించారు. అయితే అన్ని పక్కగా ప్లాన్ చేస్తున్న దర్శకుడు రాజమౌళి.. మార్చి రెండో వారంలోపు మొత్తం చిత్రీకరణ పూర్తి చేయాలని భావిస్తున్నారు.

ఆర్ఆర్ఆర్ విడుదల పోస్టర్

ఈ సినిమాలో రామ్​చరణ్ అల్లూరి సీతరామరాజు, జూ.ఎన్టీఆర్ కొమరం భీమ్​ పాత్రల్లో నటిస్తున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. అజయ్ దేవ్​గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కీరవాణి సంగీత దర్శకుడు. డీవీవీ దానయ్య దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్​తో నిర్మిస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Feb 9, 2021, 11:51 AM IST

ABOUT THE AUTHOR

...view details