ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీప్రియుల ఎదురుచూపులకు సమాధానం చెప్తూ త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది 'ఆర్‌ఆర్‌ఆర్'. ఈ సినిమా ఆఖరి షెడ్యూల్ ఉక్రెయిన్‌లో శరవేగంగా జరుగుతోంది. తారక్-ఎన్టీఆర్-ఒలీవియా మోరీస్‌లపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. విరామ సమయంలో తారక్-చెర్రీ మాట్లాడుకుంటుంటే రాజమౌళి దాన్ని షూట్ చేస్తున్నట్లు ఉన్న ఓ సరదా వీడియోను శనివారం(ఆగస్టు 8) చిత్రబృందం షేర్ చేసింది. అయితే, ఆ వీడియోలో ఎన్టీఆర్ నుదుటిపై చిన్నగాయమైనట్లు కనిపిస్తోంది. అది చూసిన తారక్ అభిమానులు ఆందోళన చెందారు. ఏమైందంటూ వరుస పోస్టులు పెట్టారు. దీంతో ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
RRR movie: ఎన్టీఆర్‌కు ఏమైంది.. 'ఆర్‌ఆర్‌ఆర్' టీమ్ క్లారిటీ - ఎన్టీఆర్ గాయం
ఎన్టీఆర్ ముఖంపై ఉన్న గాయం గురించి క్లారిటీ ఇచ్చింది 'ఆర్‌ఆర్‌ఆర్'(RRR movie) చిత్రబృందం. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ఉక్రెయిన్‌లో జరుగుతోంది.
ఓ అభిమాని.. ఆర్‌ఆర్‌ఆర్ టీమ్‌ను ట్యాగ్ చేస్తూ.. 'ఎన్టీఆర్‌కు ఆ దెబ్బేంటన్నా?' అని ట్వీట్ చేయగా.. 'అది దెబ్బ కాదు మేకప్ మాత్రమే' అని చిత్రబృందం స్పందించింది. ఆర్‌ఆర్‌ఆర్ టీమ్ రిప్లైతో అభిమానులందరూ ఊపిరిపీల్చుకున్నారు. సుమారు రూ.450 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీస్థాయిలో ఉన్నాయి. ఇందులో చెర్రీ అల్లూరి సీతారామరాజుగా.. తారక్ కొమురం భీమ్‌గా కనిపించనున్నారు. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఇదీ చూడండి:RRR movie: పిట్టగోడపై చెర్రీ- తారక్ సరదా ముచ్చట్లు