తెలంగాణ

telangana

ETV Bharat / sitara

చెర్రీ బర్త్​డే సెలబ్రేషన్స్​.. జక్కన్న, తారక్​, చరణ్​ చిందులు - రామ్​చరణ్​ బర్త్​డే సెలబ్రేషన్స్​

Ramcharan Birthday celebrations: మెగాహీరో రామ్​చరణ్​ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో దర్శకుడు రాజమౌళి, హీరో ఎన్టీఆర్​, రామ్​చరణ్​ కలిసి సరదాగా డ్యాన్స్​లు వేస్తూ సరదాగా గడిపారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్​గా మారింది.

RRR
ఆర్​ఆర్​ఆర్​

By

Published : Mar 27, 2022, 8:50 PM IST

Ramcharan Birthday celebrations: మెగాపవర్​స్టార్​ రామ్​చరణ్​ బర్త్​డే సెలబ్రేషన్స్​ ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో దర్శకుడు రాజమౌళి, ఎన్టీఆర్​ దంపతులు సహా పలువురు సెలబ్రిటీలు సందడి చేశారు. 'నాటు నాటు' పాటకు 'ఆర్​ఆర్​ఆర్'​లు కలిసి డ్యాన్స్​లు వేస్తూ సరదాగా గడిపారు. దీనికి సంబంధించిన వీడియోను తారక్​ తన ఇన్​స్టాలో పోస్ట్​ చేశారు. కాసేపట్లోనే వైరల్​గా మారిన ఈ వీడియోకు అభిమానులు విపరీతంగా లైక్స్​, కామెంట్స్​ చేస్తున్నారు. ఈ వీడియోలో "తారక్​​ నిజంగా చాలా ఏళ్ల పాటు ధైర్యం చేసి తన భార్యను వదిలేసి నా దగ్గరకు వచ్చాడు" అంటూ చెర్రీ చెప్పిన సంభాషణలు నవ్వులు పూయిస్తున్నాయి.

అంతకుముందు 'ఆర్​ఆర్ఆర్​' ప్రమోషన్స్​లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో తారక్​ మాట్లాడుతూ.."ప్రపంచానికి, సమాజానికి తెలియకుండా మేం మంచి స్నేహితులం. అది రాజమౌళికి ఒక్కడికే తెలుసు. మేము ఇద్దరం భిన్న ధ్రువాలం. భిన్న ధ్రువాలు ఆకర్షించుకుంటాయనేది మా విషయంలో కూడా జరిగింది. మార్చి 26న ప్రణతి పుట్టినరోజు. మార్చి 27న చెర్రీ​ పుట్టినరోజు. వీరిద్దరి ఇళ్లు చాలా దగ్గరగా ఉంటాయి. రాత్రి 12 గంటలకు ప్రణితిని కలిసి టక్కున రామ్​ దగ్గరకి వెళ్లిపోయేవాడిని. అతడు నన్ను కారులో ఎక్కించుకుని తీసుకెళ్లేవాడు." అని అన్నారు. దీన్ని ఉద్దేశించే తాజాగా బర్త్​డే సెలబ్రేషన్స్​లో చరణ్​.. తారక్​ గురించి పైవ్యాఖ్యలు చేశాడు.

కాగా, దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్​ఆర్​ఆర్​' ప్రపంచవ్యాప్తంగా విడుదలై రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఇందులో రామ్​చరణ్​, ఎన్టీఆర్​ ప్రధాన పాత్రలు పోషించగా అజయ్​దేవగన్​, ఆలియా భట్​, శ్రియ కీలక పాత్రలు పోషించారు.

ఇదీ చూడండి: ఎన్టీఆర్​ డబుల్​ హ్యాట్రిక్ హిట్​.. ఆమిర్​-మోహన్​లాల్​ కలిసిన వేళ

ABOUT THE AUTHOR

...view details