తారక్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఆర్ఆర్ఆర్'లోని ఎన్టీఆర్ కొత్త లుక్ విడుదలైపోయింది. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా కొమురం భీమ్ అవతార్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఇందులో బల్లెం చేతిలో పట్టుకుని సీరియస్ లుక్‌లో కనిపించారు తారక్. ఇది అభిమానులను కట్టిపడేసేలా ఉంది. ఇక తెరపై ఎన్టీఆర్ నట విశ్వరూపం చూడటమే ఆలస్యం. ఇప్పటికే విడుదలైన 'రామరాజు ఫర్ భీమ్' సినీప్రియులను ఎంతగానో అలరించింది.
"మా భీమ్‌ది బంగారులాంటి మనస్సు. కానీ, ఆయనే కనుక తిరుగుబాటు చేస్తే బలం, ధైర్యంగా నిలుస్తాడు'