'బాహుబలి' దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'రౌద్రం రణం రుధిరం' (ఆర్.ఆర్.ఆర్). కరోనా కారణంగా షూటింగ్ నిలిచిపోయింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ కలిసి నటిస్తోన్న ఈ సినిమా అక్టోబర్ మాసాంతంలో తిరిగి ప్రారంభం కానుందని సమాచారం.
ఈ నెల చివరి వారంలో షూటింగ్కు 'ఆర్ఆర్ఆర్'! - రామ్ చరణ్ వార్తలు
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ చిత్రం 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ త్వరలోనే ప్రారంభంకానుందట. ఈనెల చివరి వారంలో ఈ సినిమా చిత్రీకరణ తిరిగి మొదలుపెట్టనున్నట్లు సమాచారం.
![ఈ నెల చివరి వారంలో షూటింగ్కు 'ఆర్ఆర్ఆర్'! RRR shooting will resume on this day](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9035172-1064-9035172-1601719784184.jpg)
ఇప్పటికే చిత్రసీమలోని పలు సినిమాలు సెట్స్ పైకి వెళ్లి షూటింగ్స్ మొదలుపెట్టాయి. 'ఆర్‌ఆర్‌ఆర్' చిత్రంలో నటీనటులందరూ ఈనెల పదవ తేదీ నుంచి హోటల్లోనే 14రోజుల పాటు క్యారంటైన్‌లోనే ఉండనున్నట్లు వార్తలొస్తున్నాయి. అంతేకాదు షూటింగ్‌లో ఉండే ప్రతి వస్తువును శానిటైజ్ చేస్తూ.. సిబ్బందికి థర్మల్ స్క్రీనింగ్ ద్వారా వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకొనే ఏర్పాట్లను చిత్రబృందం చేస్తోందట.
మొత్తం మీద అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్లు సెట్స్ పైకి వెళ్లే సమయం ఆసన్నమైనందుకు ఎన్టీఆర్, రామ్‌చరణ్ అభిమానులు ఖుషిగా ఉన్నారు. ఇందులో అలియా భట్, అజయ్ దేవగణ్, సముద్రఖని తదితరులు నటిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్న చిత్రానికి కీరవాణి సంగీత స్వరాలు అందిస్తున్నారు.