ప్రతిష్టాత్మక చిత్రం 'ఆర్.ఆర్.ఆర్' త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. టెస్ట్ షూట్ కోసం ఏర్పాట్లు షురూ అయ్యాయి. భద్రతా ప్రమాణాల్ని పాటిస్తూ ఈ వారంలోనే దానిని నిర్వహించబోతున్నట్టు సమాచారం. వచ్చే నెల ఆరంభం నుంచి కథానాయకులు ఎన్టీఆర్, రామ్‌చరణ్ సెట్లోకి దిగే అవకాశాలున్నాయి. అగ్ర దర్శకుడు రాజమౌళి తీస్తున్న సినిమా ఇది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.
వచ్చే నెల నుంచి 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ - RRR RELEASE DATE
ఈ వారంలో టెస్టు షూట్ చేసిన తర్వాత, వచ్చే నెల తొలి వారం నుంచి 'ఆర్ఆర్ఆర్' చిత్రీకరణ మొదలుపెట్టనున్నట్లు సమాచారం.
ఆర్ఆర్ఆర్
లాక్‌డౌన్ తర్వాత చిత్రీకరణలకు అనుమతులు ఇచ్చిన వెంటనే, ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లాలనుకున్నారు దర్శకుడు రాజమౌళి. సాధ్యం కాలేదు. త్వరలోనే టెస్ట్ షూట్‌తో సాధ్యాసాధ్యాల్ని పరిశీలించి పనుల్ని వేగవంతం చేయనున్నట్టు తెలిసింది. బాలీవుడ్ తారలు అజయ్ దేవగణ్, అలియాభట్‌తో పాటు శ్రియ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే వేసవికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశాలున్నాయి.
ఇవీ చదవండి: