*ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చేసింది. రెండో సాంగ్‌కు సంబంధించిన అప్డేట్ను శుక్రవారం సాయంత్రం వెల్లడించనున్నట్లు చిత్రబృందం ట్వీట్ చేసింది. ఇప్పటికే వచ్చిన దోస్తీ సాంగ్ అలరిస్తోంది. ఇటీవల వచ్చిన గ్లింప్స్ సినిమాపై అంచనాల్ని పెంచేస్తోంది.
*యాంకర్ సుమ.. సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రాన్ని ఇటీవల ప్రకటించారు. ఇప్పుడు నవంబరు 6న టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ను మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని సుమ ట్వీట్ చేశారు. ఈ సినిమాకు కీరవాణి సంగీతమందిస్తున్నారు.
*బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న చిత్రం 'స్టూవర్ట్‌పురం దొంగ'. దీపావళి సందర్భంగా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇందులో డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్న బెల్లంకొండ హీరో.. సినీ ప్రియుల్ని ఆశ్చర్యపరిచారు. వివి వినాయక్ శిష్యుడు కేఎస్.. ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు.