చిత్రపరిశ్రమలో తిరిగి షూటింగ్‌లు వరుసగా ప్రారంభమవుతున్నాయి. లాక్‌డౌన్ కారణంగా గత కొన్నిరోజుల నుంచి వాయిదా పడిన చిత్రీకరణలు.. ఇప్పుడిప్పుడే జోరందుకుంటున్నాయి. భారీ బడ్జెట్ ప్రాజెక్టు 'ఆర్‌ఆర్‌ఆర్'(RRR) షూట్ కూడా ఇటీవల మొదలైంది. రెండు రోజుల క్రితమే సెట్లో రామ్‌చరణ్ అడుగుపెట్టగా.. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా పాల్గొన్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ప్రస్తుతం వీరిపై కీలక సన్నివేశాలు తీస్తున్నారు. జులై చివరినాటికి షూటింగ్ పూర్తి చేసి, ముందే చెప్పినట్లు అక్టోబరు 13 కల్లా థియేటర్లలోకి తీసుకురావాలని భావిస్తున్నారు.
RRR: 'ఆర్ఆర్ఆర్' సెట్లో భీమ్,రామ్.. చెప్పిన తేదీకే రిలీజ్? - ramcharan latest updates
ఇటీవల తిరిగి ప్రారంభమైన 'ఆర్ఆర్ఆర్'(RRR) షూటింగ్ ఫుల్ స్పీడ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. హీరోలు రామ్‌చరణ్, ఎన్టీఆర్‌పై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. జులై చివరి నాటికి షూటింగ్ ముగించి, చెప్పిన తేదీకే థియేటర్లలోకి సినిమాను తీసుకురావాలని చిత్రబృందం భావిస్తోంది.
దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో 'ఆర్ఆర్ఆర్' నిర్మిస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) తెరకెక్కిస్తుండగా ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్(Ramcharan), కొమురం భీమ్‌గా తారక్(NTR) నటిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మాత. కీరవాణి సంగీతమందిస్తున్నారు. ఆలియాభట్, ఒలీవియా మోరీస్, అజయ్ దేవ్‌గణ్, శ్రియ, తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన 'భీమ్ ఫర్ రామరాజు', 'రామరాజు ఫర్ భీమ్' టీజర్లు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
ఇదీ చూడండి: ఆర్ఆర్ఆర్: ఎన్టీఆర్ నయా అవతార్ ఆగయా!