అభిమానులకు షాక్.. వచ్చే సంక్రాంతికి 'ఆర్ఆర్ఆర్' - రామ్‌చరణ్ ఎన్టీఆర్
17:26 February 05
పండగ బరిలో రాజమౌళి 'ఆర్ఆర్ఆర్'
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తీస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'ఆర్ఆర్ఆర్' విడుదల తేదీ మారింది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయమై అధికారికంగా ప్రకటించడం సహా ఓ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.
ఈ ఏడాది జులై 30న 'ఆర్ఆర్ఆర్'ను విడుదల చేస్తామని, సినిమా ప్రకటించినపుడే చెప్పారు. కానీ ఇటీవలే ఆ తేదీ మారిందని పలు వదంతులు వినిపించాయి. దసరాకు రావొచ్చని అనుకున్నారు. కానీ వాటికి చెక్ పెడుతూ, రిలీజ్ డేట్‌ను ఖరారు చేసింది చిత్రబృందం.
ఇందులో రామ్‌చరణ్.. అల్లూరి సీతారామరాజు పాత్రలో, ఎన్టీఆర్.. కొమరం భీమ్‌గా కనిపించనున్నారు. దాదాపు రూ.350 కోట్లతో తెరకెక్కుతోంది. అజయ్ దేవగణ్, సముద్రఖని, హాలీవుడ్ నటులు రే స్టీవెన్సన్, అలిసన్ డూడీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు.