RRR prerelease event: ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా 'ఆర్అర్ఆర్'. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన ఈ మూవీ మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రమోషన్స్‌లో బిజీ అయిపోయింది. ఇందులో భాగంగా స్పెషల్ ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఈ క్రమంలోనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కూడా భారీగా ప్లాన్ చేస్తోంది.
అయితే తాజాగా ఈ వేడుక నిర్వహణ తేదీని ఖరారు చేసినట్లు తెలిసింది. మార్చి 19న బెంగళూరులోని చిక్కబల్లాపుర్లో గ్రాండ్‌గా నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ ఈవెంట్‌కు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై, స్టార్ హీరో శివరాజ్‌కుమార్‌లు ముఖ్య అతిథులుగా విచ్చేయనున్నట్లు తెలిసింది. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన వచ్చే అవకాశముంది.