తెలంగాణ

telangana

ETV Bharat / sitara

RRR movie: 'ఆర్ఆర్ఆర్' ప్రీ రిలీజ్ ఈవెంట్.. భాయ్​కు ఆహ్వానం! - ఆర్ఆర్ఆర్ ట్రైలర్

RRR pre release event: ధనాధన్ ప్రచారంతో దూసుకుపోతున్న 'ఆర్ఆర్ఆర్' టీమ్.. ముంబయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్​కు సిద్ధమవుతుంది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్​ స్టార్ హీరో, దర్శకుడిని ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

RRR movie
ఆర్​ఆర్ఆర్ మూవీ

By

Published : Dec 15, 2021, 8:13 PM IST

RRR promotions: 'ఆర్ఆర్ఆర్' ప్రమోషన్స్​ ఫుల్ స్వింగ్​లో చేస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే చిత్రదర్శకుడు రాజమౌళి, హీరోలు రామ్​చరణ్, ఎన్టీఆర్.. ఈ మధ్య ముంబయి, చెన్నై, బెంగళూరులో పర్యటించి ప్రచారంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు ముంబయిలో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్​కు ప్లాన్ చేస్తున్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్టార్ హీరో సల్మాన్​ఖాన్, దర్శకనిర్మాత కరణ్​ జోహార్​ను ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఈవెంట్​ డిసెంబరు 19న జరగనుందని సమాచారం.

జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. ఇందులో రామ్​చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్​గా నటించారు. అజయ్ దేవ్​గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీతమందించారు. డీవీవీ దానయ్య రూ.450 కోట్ల బడ్జెట్​తో నిర్మించారు.


ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details