టాలీవుడ్ ప్రముఖ హీరోలు రామ్చరణ్, జూ.ఎన్టీఆర్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఆర్.ఆర్.ఆర్'. 'బాహుబలి'తో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సినిమా టైటిల్ ఇదేనంటూ ఓ వార్త వైరల్ అవుతోంది.
ఇప్పటికే టైటిల్ కోసం అభిమానుల నుంచి సలహాలు కోరిన చిత్రబృందం.. 'రామ రౌద్ర రుషితం' అనే పేరును ఖరారు చేసినట్లు సమాచారం. విదేశీ భాషల్లో 'రైజ్ రివోల్ట్ రివేంజ్' పేరుతో విడుదల చేయనున్నారట. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.