RRR Movie Pramotions: 'ఆర్ఆర్ఆర్' సినిమా రిలీజ్ డేట్ ప్రకటించినప్పటి నుంచి చిత్ర బృందం మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా గడుపుతోంది. ఇందులో భాగంగా ఇటీవల దుబాయ్‌లో చిత్రబృందం సందడి చేసింది. ఆ తర్వాత దేశంలో వివిధ ప్రదేశాల్లో ప్రమోషన్స్ చేస్తోంది. గుజరాత్ కెవాడియాలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐక్యతా విగ్రహాన్ని చిత్రయూనిట్ ఆదివారం సందర్శించింది. చిత్ర దర్శకుడు రాజమౌళితో పాటు హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్.. స్టాట్యూ ఆఫ్ యూనిటీ వద్ద సందడి చేశారు. తాజాగా, సోమవారం అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్లో పూజలు నిర్వహించారు.
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం (రణం రౌద్రం రుధిరం) 'ఆర్ఆర్ఆర్'. ఇందులో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్‌చరణ్ సరసన అలియా భట్, ఎన్టీఆర్ సరసన ఒలివియా మోరిస్ నటిస్తున్నారు. అజయ్‌దేవ్‌గన్, సముద్రఖని, శ్రియ కీలకపాత్రలు పోషిస్తున్నారు. మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
కేజీఎఫ్ 2 సాంగ్..