RRR movie Bigboss: 'ఆర్ఆర్ఆర్'.. థియేటర్లలోకి రావడానికి మరో రెండు వారాల సమయముంది. మరోవైపు సినిమా ఎప్పుడొస్తుందా అని అభిమానుల మనసులో ఆత్రుతగా ఉంది. ఈ నేపథ్యంలోనే నేషనల్ వైడ్ ప్రచారంలో బిజీగా ఉంది చిత్రబృందం. అందులో భాగంగా హిందీలో సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'బిగ్‌బాస్' షోకు అతిథులుగా వెళ్లారు ఎన్టీఆర్, రామ్ చరణ్, ఆలియా భట్, దర్శకుడు రాజమౌళి.
'బిగ్‌బాస్' షోలో 'ఆర్ఆర్ఆర్' టీమ్ 'బిగ్‌బాస్' వేదికపై 'నాటు నాటు' (హిందీలో 'నాచో నాచో') పాటకు మూవీ టీమ్‌తో కలిసి స్టెప్పులేశారు సల్మాన్. ఈ కార్యక్రమం శనివారం రాత్రి 9.30 గంటలకు ప్రసారంకానుంది.
అంతకుముందు 'కపిల్ శర్మ' షోలోనూ సందడి చేసింది 'ఆర్ఆర్ఆర్' చిత్రబృందం. ఈ కార్యక్రమం కూడా త్వరలోనే ప్రసారం కానుంది.
'ది కపిల్ శర్మ'షో 'ఆర్ఆర్ఆర్' చిత్రబృందం
ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్'లో రామ్‌చరణ్, అల్లూరి సీతారామరాజుగా.. ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా నటించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. అజయ్ దేవ్‌గణ్, సముద్రఖని, శ్రియ కీలకపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతమందించారు. డీవీవీ దానయ్య రూ.450 కోట్లతో సినిమాను నిర్మించారు. జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఇదీ చూడండి:'ఆర్ఆర్ఆర్'లోని భీమ్ సాంగ్.. రూ.200 కోట్ల దాటిన 'పుష్ప' వసూళ్లు