భారీ అంచనాలతో రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'.. చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఆఖరి షెడ్యూల్ కోసం చిత్రబృందం ఉక్రెయిన్ వెళ్లింది. అక్టోబర్ 13న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో.. అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో 'ఆర్ఆర్ఆర్' నిర్మిస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) తెరకెక్కిస్తుండగా ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్(Ramcharan), కొమురం భీమ్‌గా తారక్(NTR) నటిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మాత. కీరవాణి సంగీతమందిస్తున్నారు. ఆలియాభట్, ఒలీవియా మోరీస్, అజయ్ దేవ్‌గణ్, శ్రియ, తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన 'భీమ్ ఫర్ రామరాజు', 'రామరాజు ఫర్ భీమ్' టీజర్లు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి