రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్‌ఆర్‌ఆర్'(RRR movie)విడుదలకు సమయం దగ్గరపడుతోంది. సినిమా విడుదలపై అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ఆఖరి షెడ్యూల్ ఉక్రెయిన్‌లో జరుగుతోంది. ఈ క్రమంలో ఓ ఫన్నీ వీడియోను చిత్రబృందం షేర్ చేసింది. ఈ వీడియోలో తారక్, చెర్రీలు కారులో ప్రయాణిస్తూ దోస్తీ సాంగ్‌ను వింటున్నారు. అందుకు తగ్గట్టుగా అభినయిస్తున్నారు. 'మీరూ మీ స్నేహితులతో కలిసి దోస్తీ సాంగ్ విని ట్యాగ్ చేయండి' అంటూ వీడియో షేర్ చేసింది చిత్రబృందం.
కారులో షికారుకెళుతూ.. చెర్రీ, తారక్ వీడియో వైరల్! - ఆర్‌ఆర్‌ఆర్ రిలీజ్
'ఆర్‌ఆర్‌ఆర్' (RRR movie)విడుదలకు రోజులు దగ్గరపడుతున్నాయి. ఆఖరి షెడ్యూల్ ఉక్రెయిన్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా తారక్, చెర్రీలు స్నేహగీతాన్ని ఆలపిస్తూ.. అందుకు తగ్గట్టుగా అభినయిస్తున్న ఓ వీడియోను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంలో ఆలియా భట్, ఒలివీయా మోరిస్ కథానాయికలు. శ్రియ, అజయ్ దేవ్‌గణ్, సముద్రఖని, ఎలిసన్ డ్యూడీ, రేయ్ స్టీవ్‌సన్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. పోరాటయోధులు అల్లూరిసీతారామరాజు, కొమురంభీమ్ కలిస్తే.. వాళ్లిద్దరి మధ్య దోస్తీ ఎలా కుదిరింది? వాళ్ల దోస్తీ చివరికి ఎటువైపునకు దారి తీసింది? ఇలాంటి ఎన్నో ఆసక్తికర అంశాలతో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌సాంగ్ ప్రతి ఒక్కర్నీ ఎంతగానో ఆకట్టుకుంటోంది. అక్టోబర్ 13న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.